‘సిట్యుయేషన్‌షిప్’ అంటే అర్థం తెలుసా?.. ట్రోలర్స్‌పై రకుల్ ఫైర్

ABN , Publish Date - Apr 25 , 2026 | 02:14 PM

తన భర్త జాకీ భగ్నానీ చేసిన కామెంట్స్‌పై నెటిజన్ల రియాక్ట్ అవుతున్న తీరును నటి రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా ఖండించారు. తమ మధ్య ఎలాంటి సమస్యలూ లేవని, ఓపెన్‌గా ఉండే బంధాన్నే జాకీ అలా వివరించారని చెప్పారు.

Rakul Preet Singh and Jackky Bhagnani

తన భర్త జాకీ భగ్నానీ (Jackky Bhagnani) చేసిన కామెంట్స్‌పై నెటిజన్ల రియాక్ట్ అవుతున్న తీరును నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తీవ్రంగా ఖండించారు. రీసెంట్‌గా రకుల్‌తో కలిసి జాకీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి, రెగ్యులర్‌గా వాడే పదాలు కాకుండా, కాస్త వెరైటీగా ఆయన చెప్పుకొచ్చారు. అందులో ‘మా ఇద్దరికీ పెళ్లి అయినప్పటికీ.. మేము సిట్యుయేషన్‌షిప్‌లో ఉన్నట్లుగానే ఫీలవుతాం’.. అనే లైన్‌ని నెటిజన్లు అండర్‌లైన్ చేసి మరీ ఆడుకుంటున్నారు. జాకీ భగ్నానీ, రకుల్ మధ్య వైవాహిక బంధం సరిగా లేదని, ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్లుగానే సాగుతుందని, త్వరలోనే వీరు విడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేలా.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ చూసిన రకుల్ ప్రీత్ సింగ్, వివరణ ఇస్తూ, సోషల్ మీడియా వేదికగా వాటిని ఖండించారు.


అసలు జాకీ భగ్నానీ ఏమన్నారంటే.. ‘‘మేము భార్యాభర్తలం, ఒకరికొకరం సిట్యుయేషన్‌షిప్‌ (Situationship)లో ఉన్నట్లుగా ఫీలవుతాం. మా మధ్య దాపరికం అనేది అస్సలు లేదు. ఏ విషయాన్నైనా, ఎవరితోనైనా నేను రకుల్ ముందు ఓపెన్‌గా మాట్లాడగలను. ఒకవేళ నా ఎక్స్-గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినా, నేను రకుల్ పక్కనే ఉన్నప్పుడు స్పీకర్‌ ఆన్‌లో పెట్టి మరీ మాట్లాడతాను. అప్పుడు రకుల్ కొంచెం ఇబ్బందిగా ఫీలవ్వొచ్చు, కానీ నాకు దాచుకోవాల్సింది ఏమీ లేదు. రకుల్‌కి నా గురించి అన్నీ తెలుసు కాబట్టి, నేను ఎందుకు దాచాలి?’’ అని చెప్పుకొచ్చారు. పక్కనే ఉన్న రకుల్ కూడా ‘అవును’ అన్నట్లుగా మధ్యలో రియాక్ట్ అయ్యారు. అయితే ఇందులోని ‘సిట్యుయేషన్‌షిప్‌’ అనే పదానికి రకరకాలుగా అర్థం చెబుతూ, వారి బంధం సరిగా లేదని, అందుకే జాకీ ఇలా చెప్పుకొచ్చారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


ఈ కామెంట్స్‌కు రకుల్ ప్రీత్ సింగ్ వివరణ ఇస్తూ.. ‘‘దాదాపు ఒక గంట పాటు జరిగిన సంభాషణలో ఒకే ఒక్క లైన్‌ను క్లిక్‌బైట్‌గా వాడిన విధానం మాకు నవ్వు తెప్పించింది. ఇది మొదట నవ్వు తెప్పించవచ్చు.. కానీ ఆ తర్వాత అది సమస్యగా మారుతుంది. ఇక్కడ సందర్భం చాలా ముఖ్యం. సిట్యుయేషన్‌షిప్‌‌కి ఉన్న అర్థాన్ని తెలుసుకోకుండా.. ఇష్టం వచ్చినట్లుగా హెడ్‌లైన్స్ పెట్టడం బాధ్యతారాహిత్యం. సంభాషణలు క్లిక్‌బైట్‌లుగా మారేంత తక్కువ స్థాయివి కావు. ఇలాంటి వార్తలు సృష్టించే ముందు కొంత బాధ్యతగా వ్యవహరించాలని తెలుసుకోండి’’ అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెలిపారు. ఇంతకీ జాకీ భగ్నానీ చెప్పిన సిట్యుయేషన్‌షిప్‌‌కి అర్థం ఏమిటంటే.. ‘పెళ్లి తర్వాత బంధం బోర్ కొట్టకుండా, స్నేహంగా ఉంటూ, కొత్త డేటింగ్ వైబ్‌ని మెయింటైన్ చేయడమే సిట్యుయేషన్‌షిప్‌ అంటారని.. అది తెలుసుకోకుండా ఎవరికి నచ్చినట్లు వారు కథలు అల్లేస్తున్నారు’ అంటూ రకుల్, జాకీ ఫ్యాన్స్.. ట్రోలర్స్‌కు క్లాస్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Varanasi: మహేష్ కోసమే ఆ కష్టాలు.. జక్కన్న పక్కా ప్లానింగ్!

స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!

అందుకే చిరు.. ‘ఠాగూర్’ సినిమాపై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!

Updated Date - Apr 25 , 2026 | 02:16 PM

Rakul Preet Singh : జీవితాన్ని ఇచ్చిన చిత్రానికి పదేళ్లు! 

Rakul Preet Singh: ఆ పదం సరైనదో కాదో తెలియదు

Rakul Preet Singh: అలా ఉండేలా చూస్తాడు.. చేస్తాడు!

Rakul Preet Singh: ఆ రోజులు పోయాయి.. ఆ సత్తా మాకూ ఉంది 

Rakul Preet Singh: గిల్టీగా ఉంది కానీ.. రకుల్ వైరల్ పోస్ట్