డిసెంబర్‌లో పెళ్లికి సిద్ధమైన మరో జంట.. ఎవరో తెలుసుగా

ABN , Publish Date - Nov 06 , 2026 | 08:14 PM

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఇంట పెళ్లి బాజాలు మోగేందుకు రంగం సిద్ధమైంది. ఆయన పెద్ద కుమారుడు, ప్రముఖ గాయకుడు-సంగీత దర్శకుడు కాలభైరవ ఓ ఇంటివాడు కాబోతున్నారు.

Kaala Bhairava KavyaKalyanram Wedding festivities

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (MM Keeravani) ఇంట పెళ్లి బాజాలు మోగేందుకు రంగం సిద్ధమైంది. ఆయన పెద్ద కుమారుడు, ప్రముఖ గాయకుడు-సంగీత దర్శకుడు కాలభైరవ (Kaala Bhairava) ఓ ఇంటివాడు కాబోతున్నారు. ‘బలగం’, ‘మసూద’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన టాలెంటెడ్ కథానాయిక కావ్య కళ్యాణ్‌రామ్‌ (Kavya Kalyanram)తో కాలభైరవ ఏడడుగులు వేయనున్నారు. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా, సంప్రదాయబద్ధంగా జరిగినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ వేడుకలో కాబోయే దంపతులు సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, రమా రాజమౌళితో పాటు కీరవాణి కుటుంబ సభ్యులు హాజరై నూతన జంటను ఆశీర్వదించినట్లుగా తెలుస్తోంది. ఎంతో ప్రైవేట్‌గా జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాలభైరవ, బాలనటిగా కెరీర్ ప్రారంభించి హీరోయిన్‌గా మంచి విజయాలు అందుకున్న కావ్య కళ్యాణ్‌రామ్ వివాహం బంధుమిత్రులు, సినీ ప్రముఖుల సమక్షంలో వచ్చే డిసెంబర్‌లో అత్యంత ఘనంగా జరగనుంది. ప్రస్తుతం ఇరు కుటుంబాలు వివాహ మహోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉండగా వీరిద్దరి మధ్య ప్రేమాయణాన్ని ఇటీవల వారు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.


Kavya-Kaalabhairava.jpg

డిసెంబర్‌లో టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి

డిసెంబర్ నెలలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ పెళ్లి బాజాలకు వేదిక కానుంది. మెగా కాంపౌండ్‌లో సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) తన ప్రేయసి కిరణ్‌ (Kiran)తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. వారి నిశ్చితార్థం నవంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. కాలభైరవ కూడా డిసెంబర్‌లోనే కావ్య కళ్యాణ్‌రామ్‌తో ఏడడుగులు వేయబోతున్నారు. డిసెంబర్‌లో పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో, అలాగే సంగీత దర్శకుడు - హీరోయిన్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి పెళ్లి పీటలెక్కనుండటంతో టాలీవుడ్‌తో పాటు సినీ అభిమానుల్లోనూ పండుగ వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి:

అప్పుడనుకున్న టైటిల్ ఇప్పుడు.. కమల్ హాసన్ నెక్స్ట్ ఫిల్మ్‌ టైటిల్ ఇదే

‘రామాయణ’పై డైరెక్టర్ శంకర్ రివ్యూ.. ఇదెవరూ ఊహించలేదు కదా

‘కాకా’ సంక్రాంతికే.. రూమర్స్‌కు కోన వెంకట్ కౌంటర్

Updated Date - Nov 06 , 2026 | 08:15 PM

Kavya Kalyanram: 'బలగం' భామ భలే వుంది, మీరూ చూసెయ్యండి !

Kavya Kalyanram: నేనలా ఎక్కడా చెప్పలేదు.. దయచేసి ఆ వార్తలు ఆపండి

కీరవాణి కోడలు కాబోతున్న బలగం హీరోయిన్.. కాలభైరవతో పెళ్లి ఫిక్స్

తమ్ముళ్లతో రొమాన్స్.. అన్నలతో పెళ్లి

'బలగం' పోరితో.. కాలభైరవ పెళ్ళి?