విడాకుల బాటలో.. మరో హీరోయిన్! మౌనీరాయ్ - సూరజ్ వివాహ బంధానికి బీటలు!?
ABN, Publish Date - May 12 , 2026 | 02:35 PM
నాగిని సీరియల్ ద్వారా ప్రాచుర్యాన్ని అందుకున్న నటి మౌనీరాయ్ వివాహబంధానికి బీటలు పడబోతున్నాయి. భర్త సూరజ్ నంబియార్ నుంచి ఆమె విడిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
'నాగిని' సీరియల్ ద్వారా నటి మౌనీరాయ్ (Mouni Roy) పలువురి మన్ననలు అందుకుంది. అప్పట్లో ఆమె టీవీ నటీనటుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే కొద్దిమంది ప్రముఖుల జాబితాలో ఉండేది. ఆ పాపులారిటీతో కొన్ని సినిమాల్లోనూ మౌనీ రాయ్ అవకాశాలు దక్కించుకుంది. అందులో కొన్ని చిత్రాలు విజయం సాధించాయి, మరికొన్ని పరాజయం పాలయ్యాయి. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే మౌనీరాయ్ దుబాయ్‌కు చెందిన మలయాళీ బిజినెస్ మ్యాన్ సూరజ్ నంబియార్ (Suraj Nambiar) తో మూడేళ్ళ పాటు రిలేషన్ షిప్‌లో ఉంది. ఆ తర్వాత వీరిద్దరూ 2022 జనవరి 27న గోవాలో పెళ్ళి చేసుకున్నారు. వివాహం బెంగాలీ, మలయాళీ సంప్రదాయాలతో ఘనంగా జరిగింది. అయితే ఇప్పుడు వీరి పెళ్ళి పెటాకులు కాబోతోందనే వార్తలు బాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్నాయి.
కారణాలు ఏమిటనేది తెలియదు కానీ తాజాగా మౌనీరాయ్, సూరజ్ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. సూరజ్ అయితే మౌనీరాయ్‌తో తన పెళ్ళి ఫోటోలన్నింటినీ డెలిట్ చేశాడని చెబుతున్నారు. ఇక వీరిద్దరికీ ప్రాణ స్నేహితురాలైన మరో నటి దిశా పటానీ (Disha Patani) సైతం సూరజ్ నంబియార్‌ను అన్ ఫాలో చేసిందని అభిమానులు అంటున్నారు. 2023లో ఎంటర్ టైనర్స్ యు.ఎస్. టూర్ సందర్భంగా ఈ ముగ్గురి మధ్య బలమైన అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత కూడా దిశా పటానీ, మౌనీరాయ్ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళుతుండేవారు. ఆ టూర్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేవారు. ఓ రకంగా ఇద్దరి మధ్య స్ట్రాంగ్ సిస్టర్స్ రిలేషన్ షిప్ ఉందని సన్నిహితులు అంటుండేవారు. ఎప్పుడైతే మౌనీరాయ్ తన భర్త సూరజ్ ను అన్ ఫాలో చేసిందో, మరుక్షణమే దిశా పటాని సైతం అతన్ని అన్ ఫ్రెండ్ చేసిందని తెలుస్తోంది. అయితే... ఇప్పటి వరకూ ఇటు మౌనీరాయ్ కానీ అటు సూరజ్ తమ రిలేషన్ ఇబ్బందుల్లో పడిందని కానీ పరస్పర అంగీకారంతో తాము విడిపోతున్నామని గానీ ఇంతవరకూ చెప్పలేదు. మరి వీరి విడాకులకు సంబంధించిన అప్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
పవన్ కళ్యాణ్, విజయ్‌ల విజయ రహస్యం అదే: ఆర్జే బాలాజీ
అందుకే తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేయడం లేదు- బోయపాటి శ్రీను
Peddi Movie: ‘పెద్ది’ ట్రైలర్‌కు డేట్ ఫిక్సయింది.. బుచ్చిబాబు ప్లాన్ ఇదే!
తన తొలి సినిమా హీరో విజయ్ పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్!