The India Story: తెలుగులో రాని 'ది ఇండియా స్టోరీ'
ABN , Publish Date - Jul 24 , 2026 | 04:41 PM
కాజల్ అగర్వాల్ తాజా చిత్రం 'ది ఇండియా స్టోరీ' కేవలం హిందీలోనే విడుదలైంది. సెన్సార్ కార్యక్రమాలు అనుకున్న సమయంలో కాకపోవడంతో తెలుగు, తమిళ వర్షన్స్ శుక్రవారం విడుదల కాలేదు.
కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే నటించిన సినిమా 'ది ఇండియా స్టోరీ'. పెస్టిసైడ్ వ్యవసాయం వల్ల మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలంలో పడే తీవ్ర ప్రభావాలను ప్రధానాంశంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహించారు. సాగర్ బి. షిండే కథ, నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రం శుక్రవారం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ కార్యక్రమాలు అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడంతో ఈ సినిమాను 24వ తేదీ కేవలం హిందీలో మాత్రమే విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషలలో విడుదల వాయిదా పడింది. బహుశా వచ్చే వారం ఈ సినిమా ఈ భాషల్లో రావచ్చు.
'ది ఇండియా స్టోరీ' కోసం ఎంచుకున్న కథ సున్నితమైంది పైగా భారతీయ వ్యవసాయ విధానానికి సంబంధించింది కావడంతో సెన్సార్ నుంచి కూడా అనేక ఇబ్బందులు ఈ సినిమాకు ఎదురయ్యాయి. వాటన్నింటినీ అనుకున్న విధంగా అమలు చేసి మొత్తానికీ హిందీ వర్షన్ కాపీ నైతే సిద్థం చేసి మేకర్స్ శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సినిమా గురించి శ్రేయాస్ తల్పాడే మాట్లాడుతూ, 'ఇది కేవలం వ్యవసాయం గురించి చెప్పే కథ కాదు. రాబోయే తరాల ఆరోగ్యం, భవిష్యత్తు గురించి చెప్పే కథ. ఇది సమాజంలో అర్థవంతమైన చర్చకు దారి తీసే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది. ప్రేక్షకుల్లో అవగాహన తీసుకురాగల శక్తి 'ది ఇండియా స్టోరీ'కి ఉంది' అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
త్రిషకి ‘జననాయగన్’ నచ్చలేదా? అందుకే సైలెంట్‌గా...
‘జన నాయగన్’.. బాలయ్యని విజయ్ మ్యాచ్ చేయలేకపోయాడా?
రాజమౌళికి దక్కింది.. మరి సందీప్ వంగాకి ఎప్పుడు?