సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అచ్చం అమ్మలాగే.. ‘నగీనా’ శ్రీదేవిగా జాన్వీ కపూర్.. హాలోవీన్ లుక్ వైరల్

ABN, Publish Date - Nov 01 , 2026 | 01:58 PM

అలనాటి అందాల తార, దివంగత లెజెండరీ నటి శ్రీదేవి పోషించిన ఐకానిక్ పాత్రల్లో 1986లో వచ్చిన ఫాంటసీ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘నగీనా’ ఒకటి. ఈ సినిమాలో శ్రీదేవి పాత్రని రీ క్రియేట్ చేస్తూ.. జాన్వీ అందరినీ ఆశ్చర్యపరిచారు.

Janhvi in Nagina Look

అలనాటి అందాల తార, దివంగత లెజెండరీ నటి శ్రీదేవి (Sridevi) పోషించిన ఐకానిక్ పాత్రల్లో 1986లో వచ్చిన ఫాంటసీ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘నగీనా’ (Nagina) ఒకటి. అందులో ‘ఇచ్చాధారి నాగిని’గా శ్రీదేవి కనబరిచిన నటన, ఆమె కళ్లలోని తీవ్రత, క్లాసిక్ డ్యాన్స్ మూమెంట్స్ భారతీయ సినీ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాయి. తాజాగా హాలోవీన్ (Halloween) సందర్భంగా తన తల్లికి అద్భుతమైన రీతిలో నివాళులర్పిస్తూ శ్రీదేవి ‘నగీనా’ ఐకానిక్ లుక్‌ను రీక్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor).


ఈ ప్రత్యేకమైన ఫోటోషూట్‌లో జాన్వీ కపూర్ అచ్చం శ్రీదేవిలాగే తెల్లటి-గులాబీ రంగు సంప్రదాయ దుస్తులు, నాగిని ఆభరణాలు, అదే హెయిర్‌స్టైల్, ఐ-మేకప్‌తో అచ్చుగుద్దినట్లు కనిపించారు. ఆమెతో పాటు ఆమె క్లోజ్ ఫ్రెండ్ ఓరీ (Orry) కూడా ఈ రిక్రియేషన్‌లో భాగస్వామ్యమయ్యారు. ఓరీ రిషీ కపూర్ పాత్రలో సూట్ ధరించి కనిపించగా, వెనుక అమ్రీష్ పురి పోషించిన మాంత్రికుడి పాత్రను సైతం సెట్స్‌తో సహా యథాతథంగా రీక్రియేట్ చేశారు. అంతేకాకుండా ‘నగీనా’ ఒరిజినల్ మూవీ పోస్టర్‌ను పోలి ఉండేలా చేసిన పోస్టర్ రిక్రియేషన్ చూసి సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ జాన్వీ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు.. ‘‘హ్యాపీ హాలోవీన్.. భారతీయ సినిమాలోనే అత్యంత ఐకానిక్ మూమెంట్స్‌లో ఒకదానిని ఇలా రిక్రియేట్ చేయాల్సి వచ్చింది. సాధారణంగా హాలోవీన్ అంటే నచ్చిన పాత్రల రూపంలో ముస్తాబవ్వడం.. అవి కొన్నిసార్లు భయానకంగా, మరికొన్నిసార్లు సరదాగా ఉంటాయి, ఇంకొన్నిసార్లు నివాళిగా ఉంటాయి. ఇక మా అమ్మ, రిషీ అంకుల్, అమ్రీష్ సర్ కంటే ఐకానిక్ వ్యక్తులు ఎవరుంటారు చెప్పండి!’’ అంటూ రాసుకొచ్చారు.


జాన్వీ పోస్ట్‌పై సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జాన్వీ సోదరి ఖుషీ కపూర్ స్పందిస్తూ ‘నువ్వు హాలోవీన్ విన్నర్‌గా నిలిచావు’ అని కామెంట్ చేయగా, ఓరీ ‘మనమే విన్నర్స్’ అంటూ బదులిచ్చారు. తల్లి జ్ఞాపకాలను ఇంత అద్భుతంగా, పర్ఫెక్ట్ ఫ్రేమ్‌తో పునరావిష్కరించిన జాన్వీ డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాలో శ్రీలీల కాదా.. ఆ బాలీవుడ్ బ్యూటీయేనా?

‘ఆద‌ర్శ కుటుంబం’లో ఆ పాటని పక్కన పెట్టేయడానికి కారణమిదేనా?

ఎన్టీఆర్ ‘డ్రాగన్’.. రంగంలోకి మరో మ్యూజిక్ డైరెక్టర్?

Updated Date - Nov 01 , 2026 | 01:58 PM