Janhvi Kapoor: మనది దూకుడు కాదు.. దశాబ్దాల బాధకు సమాధానం

ABN , Publish Date - May 10 , 2025 | 02:58 PM

భారతదేశం-పాక్‌ (India -Pak) సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, జమ్మూపై దాడులకు సంబంధించిన వీడియోలు చూసి దిగ్ర్భాంతికి గురైనట్లు బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) అన్నారు.


భారతదేశం-పాక్‌ (India -Pak) సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, జమ్మూపై దాడులకు సంబంధించిన వీడియోలు చూసి దిగ్ర్భాంతికి గురైనట్లు బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) అన్నారు. గురువారం పాకిస్థాన్‌ చేసిన డ్రోన్‌ దాడులు ఎంతో బాధ కలిగించాయని ఆమె అన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ సుధీర్ఘ పోస్ట్‌ పెట్టారు. ‘‘గత రాత్రి టీవీ, సామాజిక మాధ్యమల్లో నేను చూసిన విజువల్‌ కంటతడి పెట్టించాయి. ఇప్పటివరకూ ఎప్పుడూ అనుభవించని ఆందోళన ఇది. ఇన్ని రోజులు విదేశాల్లో ఇలాంటి దాడులు జరుగుతుంటే శాంతిని పాటించాలని కోరుకున్నాం. కానీ.. ఇప్పుడు అదే పరిస్థితి మనవరకు వచ్చింది. భారత్‌ ఎప్పుడూ కయ్యానికి కాలని దువ్వదు. దశాబ్దాలుగా ఇలాంటి దాడులు ఎదుర్కొన్న తర్వాత.. ఇప్పుడు తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. 

మనది దూకుడు కాదు.. దశాబ్దాల బాధకు సమాధానం. మన సాయుధ దళాలు శత్రుదేశం వీరోచిత పోరాటం చేస్తున్నాయి. మనల్ని, మన భూమిని, మన సార్వభౌమత్వాన్ని మన సైనికులు అనుక్షణం రక్షిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా కూడా ఐక్యంగా ఉంటూ వారికి మద్దతు ఇద్దాం. శత్రు దేశం అరాచకత్వాన్ని ఇకపై చూసీచూడనట్లు ఉండేది లేదని.. గట్టిగా బదులిస్తామని వారికి తెలిసొచ్చేలా చేద్దాం. ఈ యుద్థంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నన్ను బాధిస్తోంది. త్వరలోనే దీనికి శాశ్వతంగా ముగింపు పలకాలని ఆశిస్తున్నాను. మన సైనికుల కోసం ప్రార్థిస్తుంటాను’’ అని జాన్వీ రాసుకొచ్చారు.

Updated Date - May 10 , 2025 | 03:09 PM