సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Main Vaapas Aaunga: ప్రేక్షకులకు ఇంతియాజ్ అలీ కృతజ్ఞతలు

ABN, Publish Date - Jul 22 , 2026 | 01:23 PM

జూన్ 12న విడుదలైన 'మై వాపస్ ఆవూంగా' చిత్రం ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రేక్షకులను కలిసి దర్శకుడు ఇంతియాజ్‌ అలీ కృతజ్ఞతలు తెలిపారు.

Main Vaapas Aaunga

హిందీ సినిమా 'మై వాపస్ ఆవుంగా' జూన్ 12న జనం ముందుకు వచ్చింది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమాకు మంచి వసూళ్ళు లభిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 450 థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. అలానే పది విదేశాల్లోనూ ఈ సినిమా స్క్రీనింగ్ జరుగుతోంది. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల నుంచి ఎదురౌతున్న పోటీని తట్టుకుని ఈ సినిమా ముందుకు సాగుతోందని రిలయన్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలోనూ, 59 దేశాలల్లోనూ 800లకు పైగా స్క్రీన్స్ లో ఈ సినిమా ప్రదర్శితమౌతోంది. హిందీ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో కూడా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడం విశేషం.


ఈ సినిమాకు వస్తున్న స్పందన నేపథ్యంలో దర్శకుడు ఇంతియాజ్‌ అలీ జూలై 21న హైదరాబాద్‌కు వచ్చి ప్రేక్షకులను కలుసుకున్నారు. తమ సినిమాను ఇంతగా ఆదరించి విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి అభిమానులతో మాట్లాడి వారి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకుల సానుకూల స్పందన వల్లే థియేటర్లలో షోలు పెరిగాయని, భారత్‌తో పాటు విదేశాల్లో కూడా సినిమా విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.

మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ సినిమా, ప్రేక్షకుల నోటి మాట ప్రచారంతో ఇప్పుడు ఈ ఏడాది అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలువబోతోంది. ముఖ్యంగా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ సినిమా భావోద్వేగ కథ, అద్భుత నటన, హృదయానికి హత్తుకునే సన్నివేశాలతో ఆకట్టుకుంది. దిల్‌జిత్ దోసాంజ్, నసీరుద్దీన్ షా, శర్వరి, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను బిర్లా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ తో కలిసి మోహిత్ చౌదరి, శిబాసిష్ సర్కార్ నిర్మించారు.

ALSO READ:

స్పిరిట్ లో కత్రీనా కైఫ్.. ఏం ప్లాన్ చేశావయ్యా సందీపూ
బాలయ్యకు ప్రమాదం.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే

పెళ్లి తరువాత అక్కినేని కోడలు రీఎంట్రీ.. ఆ హీరోతో రొమాన్స్

Updated Date - Jul 22 , 2026 | 01:35 PM