Ganesh Acharya: గణేష్ ఆచార్య జీవితంలో ఇన్ని కష్టాలా? బయోపిక్ ట్రైలర్ ఆసక్తికరం!
ABN, Publish Date - Oct 12 , 2026 | 02:57 PM
భారతీయ సినీ పరిశ్రమలో తనదైన శైలి కొరియోగ్రఫీతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డ్యాన్స్ మాస్టర్ గణేష్ (Ganesh Acharya) ఆచార్య జీవిత కథ వెండితెరపైకి రాబోతోంది. ‘
భారతీయ సినీ పరిశ్రమలో తనదైన శైలి కొరియోగ్రఫీతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డ్యాన్స్ మాస్టర్ గణేష్ (Ganesh Acharya) ఆచార్య జీవిత కథ వెండితెరపైకి రాబోతోంది. ‘గణేష్.. డస్ట్ టు స్టార్ డస్ట్’ (Dust to star Dust)పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ఈ బయోపిక్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఒక సాధారణ వ్యక్తి నుంచి స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన గణేష్ ఆచార్య ప్రయాణంలో ఎదురైన కష్టాలు, కన్నీళ్లు, పోరాటాన్ని ఈ ట్రైలర్ ఆవిష్కరిస్తోంది.
పేదరికం నుంచి.. అగ్రస్థానం వరకు!
గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు.. విభిన్నమైన డ్యాన్స్ కంపోజిషన్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కళాకారుడు. వెస్ట్రన్, క్లాసికల్ స్టైల్స్‌ను మేళవిస్తూ పాటలకు కొత్త అందాన్ని తీసుకొచ్చే ఆయన ప్రతిభకు జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించింది. రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఒకప్పుడు కనీస అవసరాలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తి... ఆ తర్వాత దేశం గర్వించే కొరియోగ్రాఫర్‌గా ఎలా ఎదిగారన్నది ఈ చిత్రంలో ప్రధానాంశం. ఆయన కెరీర్ వెనుక ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయనే విషయాన్ని, ఆయన జీవితంలో ఇంతటి విషాదం, సంఘర్షణ ఉన్నాయా? అనే అంశాలను ట్రైలర్‌లో చెప్పారు. గణేష్ ఆచార్య పాత్రలో శివాంశు సోని నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్సదకత్వం వహిస్తున్నారు. గతంలో ‘స్వామి’, ‘ఏంజెల్’, ‘బికారీ’, 'మనీ హై తో హనీ హై' చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుడిగానూ పలు సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు తన జీవిత కథను తానే వెండితెరపైకి తీసుకొస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేకత. డిసెంబర్ 11న ఈ సినిమా విడుదల చేయనున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా గణేష్ ఆచార్య సుపరిచితమే. ‘పుష్ప’, ‘గేమ్ ఛేంజర్’ వంటి చిత్రాలకు ఆయన కొరియోగ్రఫీ అందించారు.
ఇవి కూడా చదవండి:
‘రామాయణ’ న్యూ పోస్టర్ అదిరింది.. అడ్వాన్స్ బుకింగ్స్ అప్డేట్
సత్యదేవ్, ఫరియా ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ ప్రారంభం
ఉత్తమ నటుడిగా జేడీ చక్రవర్తి.. అంతర్జాతీయ పురస్కారం