‘దాయ్రా’లో డీసీపీ అజూనీ కోహ్లీగా కరీనా.. పవర్‌ఫుల్ పోస్టర్ వైరల్
ABN, Publish Date - Aug 29 , 2026 | 05:16 PM
బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మోస్ట్ అవేటెడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘దాయ్రా’ నుంచి కరీనా ఫస్ట్ లుక్ విడుదలైంది.
బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan), మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మోస్ట్ అవేటెడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘దాయ్రా’ (Daayra). ‘రాజీ’, ‘సామ్ బహదూర్’ వంటి కల్ట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జంగ్లీ పిక్చర్స్, డాక్టర్ జయంతిలాల్ గడా (పెన్ స్టూడియోస్) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కరీనా కపూర్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన కరీనా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ పోస్టర్‌లో కరీనా కపూర్ ‘డీసీపీ అజూనీ కోహ్లీ’ (DCP Ajooni Kohli) అనే ఐపీఎస్ అధికారిణిగా ఖాకీ యూనిఫామ్‌లో తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు. ‘అన్‌ఫ్లించించ్.. అన్‌రీడబుల్.. అన్‌అఫ్రైడ్’ (ఎవరికీ తలవంచని, అంత సులువుగా అర్థంకాని, ఏమాత్రం భయపడని వ్యక్తిత్వం) అంటూ ఆమె పాత్రను పరిచయం చేసిన తీరు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. వెనుక లారీల నేపథ్యం, పోలీస్ క్రైమ్ సీన్ కార్డన్ టేప్ మధ్య కరీనా ఇచ్చిన ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్ కథలోని తీవ్రతను, ఉత్కంఠను తెలియజేస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను ఆగస్ట్ 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హిందీతో పాటు మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ‘దాయ్రా’ చిత్రాన్ని సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. మేఘనా గుల్జార్ మార్క్ రియలిస్టిక్ టేకింగ్, కరీనా-పృథ్వీరాజ్ కాంబో నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. థియేట్రికల్ రన్ అనంతరం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది.
ఇవి కూడా చదవండి:
శంకర్-మురుగదాస్ కాంబోలో మూవీ.. బాక్సాఫీస్ షేకే!
‘ది ప్యారడైజ్’ నుంచి ‘ఏషనాగుల’ మాస్ ఫోక్ ఆంథమ్ వచ్చేసిందోచ్
‘ఇరుముడి’ ఓటీటీకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ వివరాలివే