శంకర్-మురుగదాస్ కాంబోలో మూవీ.. బాక్సాఫీస్ షేకే!

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:55 PM

సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించి, తమదైన మార్క్ విజన్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఇద్దరు దిగ్గజ దర్శకులు ఇప్పుడు చేతులు కలపబోతున్నారనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

Shankar and AR Murugadoss

సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించి, తమదైన మార్క్ విజన్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఇద్దరు దిగ్గజ దర్శకులు ఇప్పుడు చేతులు కలపబోతున్నారనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. వారు ఎవరో కాదు.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ (Director Shankar), మాస్ కమర్షియల్ డైరెక్టర్ ఎ. ఆర్. మురుగదాస్ (AR Murugadoss). వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక అత్యంత భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఈ క్రేజీ కాంబో వార్త విన్న సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు.

సాధారణంగా ఇలాంటి ఇద్దరు పెద్ద దర్శకులు కలిస్తే ఒకరు నిర్మాతగా ఉండి, మరొకరు దర్శకత్వం వహించడం చూస్తుంటాం. కానీ, ఇప్పుడు వినిపిస్తున్న టాక్ పూర్తిగా వేరు. ఈ బిగ్గెస్ట్ కొలాబరేషన్‌లో మాస్ అండ్ కమర్షియల్ జానర్స్‌లో దిట్ట అయిన ఎ. ఆర్. మురుగదాస్ ఒక పవర్‌ఫుల్ కథను అందించనుండగా, విజనరీ డైరెక్టర్ ఎస్. శంకర్ తనదైన మేకింగ్‌తో, భారీ విజువల్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. సామాజిక అంశాలు, బలమైన సందేశాన్ని కమర్షియల్ హంగులతో లార్జర్ దేన్ లైఫ్ విజువల్స్‌గా చూపించడంలో ఇద్దరూ సిద్ధహస్తులే. ఒకరు అందించే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌కు మరొకరి అత్యున్నత విజన్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాను రావడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


కోలీవుడ్ నుంచి వచ్చి పాన్ ఇండియా స్థాయిలో తమదైన చెరగని ముద్ర వేసిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ముందువరుసలో ఉంటాయి. శంకర్ ప్రారంభించిన కమర్షియల్ సోషల్ డ్రామా స్టైల్‌కు మరో వెర్షన్‌లా మురుగదాస్ కూడా పలు సంచలన చిత్రాలు తీసి మెప్పించారు. అయితే, గత కొంతకాలంగా ఈ ఇద్దరు మాస్టర్ మైండ్స్ తమ స్థాయికి తగ్గ సరైన విజయం కోసం చూస్తున్నారు. ఎంతటి ఫామ్‌లో లేకపోయినా, వీరి బ్రాండ్ పట్ల ఆడియన్స్‌లో ఉన్న నమ్మకం తగ్గలేదు. అందుకే ఒక సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ ఇద్దరు దిగ్గజాలు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.


ఇద్దరు బిగ్గెస్ట్ డైరెక్టర్లు ఒకే ప్రాజెక్ట్ కోసం ఇలా చేతులు కలపడం ఫిలిం హిస్టరీలోనే అరుదైన విషయం. అందుకే ఈ కాంబో అనౌన్స్‌మెంట్ వార్తలతోనే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టులో నటించబోయే హీరో ఎవరు, ప్రొడక్షన్ వివరాలు ఏమిటి? అనే విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం, శంకర్ మార్క్ విజన్‌కు మురుగదాస్ కథ తోడై ఇండియన్ బాక్సాఫీస్ మునుపెన్నడూ చూడని కొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయం. ప్రస్తుతానికి ఇవి సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్న క్రేజీ రూమర్స్ మాత్రమే కాగా, ఈ కాంబినేషన్ నిజంగా సెట్స్ పైకి వెళ్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

ఇవి కూడా చదవండి:

‘ది ప్యారడైజ్’ నుంచి ‘ఏషనాగుల’ మాస్ ఫోక్ ఆంథమ్ వచ్చేసిందోచ్

‘ఇరుముడి’ ఓటీటీకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ వివరాలివే

హారర్ మూవీతో తాప్సీ టాలీవుడ్ రీ-ఎంట్రీ.. దర్శకుడెవరంటే

Updated Date - Aug 29 , 2026 | 04:55 PM