సామాన్యురాలి నుంచి సంగీత సామ్రాజ్ఞిగా.. ఆశా భోంస్లే జీవితం - విశేషాలు

ABN , Publish Date - Apr 12 , 2026 | 10:07 PM

భారతీయ సంగీత శిఖరం, పద్మ విభూషణ్, గాన కోకిల ఆశా భోంస్లే (92) ఏప్రిల్ 12, ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

Asha Bhosle

భారతీయ సంగీత శిఖరం, పద్మ విభూషణ్, గాన కోకిల ఆశా భోంస్లే (92) ఏప్రిల్ 12, ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. భారతీయ సంగీత ప్రపంచంలో ఆశా భోంస్లే (Asha Bhosle) పేరు ఒక వెలుగులీనే నక్షత్రం. ఏడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ ప్రస్థానంతో, ఆమె కేవలం ఒక లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ మాత్రమే కాదు, ప్రపంచ సంగీత రంగంపై చెరగని ముద్ర వేసిన ఒక సాంస్కృతిక చిహ్నమని చెప్పొచ్చు. ఒక సామాన్యురాలిగా ప్రారంభమై, ఒక సంగీత సామ్రాజ్ఞిగా తనని తాను మలుచుకున్నారు. ఆశా తాయి, దీదీగా సంగీత ప్రపంచానికి అమ్మగా మారారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఆమె జీవితంలోని విశేషాలను చెప్పుకోవాలంటే..


మహారాష్ట్రలోని సాంగ్లీలో 1933, సెప్టెంబర్ 8న ఆశా భోంస్లే జన్మించారు. ఆమె తండ్రి పేరు పండిట్ దీనానాథ్ మంగేష్కర్. ఆయనొక శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. ఆమె అక్క లతా మంగేష్కర్ అందరికీ సుపరిచితమే. భారతదేశపు గొప్ప నేపథ్య గాయనిగా లతా మంగేష్కర్ భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. చిన్నతనం నుంచే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన ఆశా భోంస్లే, ప్లేబ్యాక్ సింగింగ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. 1940లో మరాఠీ సినిమాలతో ఆశా ప్రయాణం మొదలైంది. మొదట్లో గీతా దత్, నూర్జహాన్ వంటి గాయనీమణుల ప్రభావం ఆమెపై ఉన్నప్పటికీ, 1950లలో సంగీత దర్శకుడు ఓ.పి. నయ్యర్‌ సారథ్యంలో ఆమె పాడిన పాటలను జనాలను మెప్పించారు. ఆశా భోంస్లే‌కు ఇదే టర్నింగ్ పాయింట్. ఆ పాటనే ఆమెను స్టార్‌ను చేశాయి. ఇక అక్కడి నుంచి ఆమె శకం మొదలైంది. ‘ఉడే జబ్ జబ్ జుల్ఫేన్ తేరీ’, ‘ఆయియే మెహెర్బాన్’ వంటి పాటలు ఆమె గొంతులోని వైవిధ్యాన్ని చాటిచెప్పాయి. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. హుషారైన క్యాబరే పాటల నుండి హృదయాన్ని తాకే గజల్స్ వరకు ఆమె ఏదైనా అలవోకగా పాడగలరు. హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగుతో సహా అనేక భాషల్లో వేల సంఖ్యలో పాటలు పాడి.. అప్పట్లో సంగీత దర్శకుల మొదటి ఛాయిస్‌గా నిలిచారు.


భారతీయ సంగీత చరిత్రలో ఆశా భోంస్లే, ఆర్.డి. బర్మన్ జోడీ ఒక సంచలనం అనే విషయం అప్పటి తరానికి తెలియంది కాదు. ‘దమ్ మారో దమ్’, ‘పియా తూ అబ్ తో ఆజా’ వంటి క్లాసిక్ సాంగ్స్ వీరి కలయికలో వచ్చినవే. ఆశా గాత్రం, బర్మన్ కంపోజిషన్ వెండితెరపై మ్యాజిక్ సృష్టించాయి. తెలుగులో కూడా ఆమె పాడిన పాటలు విశిష్ట ఆదరణను పొందాయి. ‘నాలో ఊహలకు’ పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ‘చందమామ’, ‘పవిత్రబంధం’, ‘ఇద్దరు’, ‘పాలు నీళ్లు’, ‘అర్థాంగి’ వంటి చిత్రాల్లో ఆమె పాటలు పాడారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘పద్మ విభూషణ్’, ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డులతో గౌరవించింది. అలాగే ఆమె ఎన్నో జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా అందుకున్నారు. భారతీయ సంగీతానికి ఆమె గ్లోబల్ అంబాసిడర్‌గా నిలిచారు. ఆశా భోంస్లే తన పాటలతోనే కాకుండా, తర్వాతి తరానికి చెందిన ఎందరో గాయనీమణులకు స్ఫూర్తిగా నిలిచారు. కళకు వయసుతో సంబంధం లేదని ఆమె నిరూపించారు. తరాలు మారినా ఆమె పాటలు నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

సింగర్ మంగ్లీ కేసులో ట్విస్ట్.. ఇదంతా బిగ్‌బాస్ కోసమేనా?

లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మృతి.. ప్రముఖుల నివాళులు

ఎం.ఎస్. రాజు రూటు మార్చారు.. ఈసారి నో ఫీలింగ్స్!

Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?

Venu Udugula: మంగ్లీ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు

UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!

Updated Date - Apr 12 , 2026 | 10:07 PM