ఇండస్ట్రీలోకి మరో స్టార్ కిడ్ ఎంట్రీకి అంతా సిద్ధం.. ఎవరంటే
ABN, Publish Date - Sep 04 , 2026 | 09:03 AM
ఏ ఇండస్ట్రీలోనైనా పాత నీరు పోయి, కొత్త నీరు వస్తుండటం సహజమే. సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ మార్పు నిత్యం జరుగుతూనే ఉంటుంది.
ఏ ఇండస్ట్రీలోనైనా పాత నీరు పోయి, కొత్త నీరు వస్తుండటం సహజమే. సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ మార్పు నిత్యం జరుగుతూనే ఉంటుంది. స్టార్ హీరోల హవా అనంతరం వారి వారసుల ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అలా ఎంట్రీ ఇచ్చే వారసులు ఇప్పుడు లైన్‌లో చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి మరో స్టార్ వారసుడి రంగప్రవేశానికి రంగం సిద్ధమైంది. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ (ArbaazKhan), నటి మలైకా అరోరా (Malaika Arora)ల తనయుడు అర్హాన్ ఖాన్ (Arhaan Khan) వెండితెరకు పరిచయం కాబోతున్నారు. సాధారణంగా స్టార్ కిడ్స్ రొమాంటిక్ లవ్ స్టోరీలతో లేదా సాఫ్ట్ ఎంట్రీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం చూస్తుంటాం. కానీ అర్హాన్ ఖాన్ మాత్రం అందుకు భిన్నంగా పూర్తి మాస్, యాక్షన్ అవతారంలో అదిరిపోయే మాస్ లాంచ్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఆయుష్మాన్ ఖురానాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘యాన్ యాక్షన్ హీరో’ (An Action Hero) చిత్రాన్ని తెరకెక్కించిన ప్రతిభావంతుడైన దర్శకుడు అనిరుధ్ అయ్యర్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో అత్యున్నత స్థాయి మేకింగ్ వాల్యూస్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అర్హాన్ ఖాన్ పాత్రను పక్కా మాస్ అండ్ ఇంటెన్స్ రోల్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు చేరుకుంది. ఇందులో ఉండే భారీ యాక్షన్ సన్నివేశాలు, హై-ఆక్టేన్ స్టంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ (Salman Khan) కుటుంబం నుంచి వస్తున్న మరో వారసుడు కావడంతో అర్హాన్ ఖాన్ ఎంట్రీపై బీ-టౌన్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.
ఇవి కూడా చదవండి:
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చరణ్, సుక్కు మూవీకి ముహూర్తం ఖరారు
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ‘ఏషనాగుల’ సాంగ్
జక్కన్న నెక్ట్స్ హీరో ఎవరు.. ఆ లెక్కలన్నీ మారుతాయా?