జక్కన్న నెక్ట్స్ హీరో ఎవరు.. ఆ లెక్కలన్నీ మారుతాయా?
ABN , Publish Date - Sep 03 , 2026 | 04:59 PM
కెరీర్‌లో ప్రతి ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా మలచడంలో జక్కన్న దిట్ట అనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తోన్న ‘వారణాసి’ ప్రాజెక్ట్ అనంతరం, జక్కన్న ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనే టాపిక్ వైరల్ అవుతోంది.
ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ (Varanasi) చిత్రం ముందు వరుసలో ఉంటుంది. దాదాపు రూ. 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ విజువల్ వండర్‌తో ఇటు మహేష్‌కు కూడా గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు రావడం ఖాయం. అయితే ‘వారణాసి’ తరువాత జక్కన్న ఏ హీరోతో సినిమా తెరకెక్కిస్తాడనే దానిపై సినిమా ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కెరీర్‌లో ప్రతి ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా మలచడంలో జక్కన్న దిట్ట అనే చెప్పాలి. ‘బాహుబలి’ కోసం దాదాపు ఐదేళ్లు, ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం మరో ఐదేళ్లు కేటాయించిన ఆయన.. ఇప్పుడు మహేష్ బాబుతో తెరకెక్కిస్తోన్న ‘వారణాసి’ ప్రాజెక్ట్ కోసం కూడా అదే స్థాయిలో శ్రమిస్తున్నారు.
పూర్తి ఐమాక్స్ కెమెరాలతో రూపొందుతున్న ఈ బిగ్గెస్ట్ అడ్వెంచర్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్కో సినిమాకు రాజమౌళి తీసుకుంటున్న సమయం చూస్తుంటే.. ఆయనతో సినిమా చేయాలని కలలు కనే స్టార్ హీరోల జాబితా చాలా పెద్దదే ఉంది. మరి ఈ భారీ చిత్రం పూర్తయిన తర్వాత జక్కన్న నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తారు? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు చాలా మంది టాప్ హీరోలు రాజమౌళి కాల్షీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అందులో ముఖ్యంగా రెండు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో మొదటిది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun). ‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న బన్నీ.. ప్రస్తుతం అట్లీతో పాటు లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ లైనప్ పూర్తయ్యేసరికి రాజమౌళి కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.
ఇక రెండో పేరు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya). రాజమౌళి డైరెక్షన్‌లో నటించాలని తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు సూర్య ఇప్పటికే పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. గతంలో జక్కన్న దర్శకత్వంలో తనకు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకున్నానని.. ఆ తర్వాత ఆయన ఎంతో ఫీలయ్యారట. ఇకపై జక్కన్నతో పనిచేసే అవకాశం వస్తే వదులుకునే ప్రసక్తే లేదని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. వీరిద్దరితో పాటు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం మీద కూడా ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆయన గనుక భారీ మల్టీస్టారర్ వైపు అడుగులు వేస్తే.. ఈ లెక్కలన్నీ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఏదేమైనా, మహేష్ సినిమా తర్వాత జక్కన్న ఎవరిని తన హీరోగా ఎంచుకుంటారనే సస్పెన్స్ మాత్రం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
హీరోయిజం కాదు.. ఇప్పుడు దర్శకులదే హవా
‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ డేట్ ఫిక్స్.. వర్కవుట్ అవుతుందా
Pakeezah: అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లో రీస్టోర్డ్ వెర్షన్ ప్రీమియర్