సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nepal Floods: ప్రకృతి శక్తి ముందు మనం చాలా చిన్నవాళ్లం’.. నేపాల్ వరదలపై అమితాబ్

ABN, Publish Date - Aug 29 , 2026 | 03:49 PM

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్ నేపాల్‌ వరదలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్ నేపాల్‌ వరదలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రకృతి ప్రకోపం సృష్టించిన విధ్వంసకర దృశ్యాలు తనను కలచివేశాయని  పేర్కొన్నారు. ప్రకృతి శక్తి ముందు మానవులు ఎంత చిన్నవారో ఈ విపత్తు మరోసారి గుర్తు చేస్తోందని అన్నారు. తాజాగా తన బ్లాగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ నేపాల్‌ పరిస్థితులపై స్పందించారు.

''అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు ఎంతో బాధ కలిగిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు ధైర్యం, సహాయం అందించాలి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మానవ ప్రయత్నాలతో పాటు దైవానుగ్రహం కూడా ఎంతో అవసరం. ప్రకృతి తన శక్తిని చూపించినప్పుడు మనం దాని ముందు నిలబడలేం.  మనం చేయగలిగింది ఆ దేవుడిని ప్రార్థించడమే. ఎందుకంటే ఆయన శక్తి అన్నింటికంటే గొప్పది' అని పేర్కొన్నారు. నేపాల్‌లో వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితులపై పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే స్పందించారు. సంజయ్ దత్, సోనూసూద్‌, మనీషా కోయిరాలా, శింబు తదితరులు సోషల్‌ మీడియా ద్వారా తమ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, సహాయక చర్యలు మరింత వేగవంతం కావాలని ఆకాంక్షించారు. 

ఇవి కూడా చదవండి:

‘ఇరుముడి’ ఓటీటీకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ వివరాలివే

హారర్ మూవీతో తాప్సీ టాలీవుడ్ రీ-ఎంట్రీ.. దర్శకుడెవరంటే

‘ధర్మస్థల నియోజకవర్గం’ ట్రైలర్.. పొలిటికల్ హీట్ పెంచిన పవర్‌ఫుల్ డైలాగ్స్

Updated Date - Aug 29 , 2026 | 05:22 PM