సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Amitabh Bachchan: శస్త్ర చికిత్స జరగలేదట..

ABN, Publish Date - Jul 22 , 2026 | 12:13 PM

ఇటీవల తన బ్లాగ్ లో పెట్టిన వ్యాఖ్యలను జనం తప్పుగా అర్థం చేసుకున్నారని అమితాబ్ అన్నారు. తనకు ఎలాంటి శస్త్ర చికిత్స జరగలేదని తన వ్యాఖ్యలు ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ కు సంబంధించినవని వివరణ ఇచ్చారు.

Amitabh Bachchan

ఇటీవల తన బ్లాగ్ లో పెట్టిన ఓ సందేశంలోని బిట్వీన్ ద లైన్స్ ను అర్థం చేసుకోవడంలో కొందరు విఫలమయ్యారని అమితాబ్ తెలిపారు. అమితాబ్ తన బ్లాగ్ లో 'శస్త్ర చికిత్స అనంతరం కోలుకోవడం కష్టం' అంటూ ఓ మేటర్ ను పోస్ట్ చేశారు. దీనికి ఆయన 'శస్త్ర చికిత్స... ఐసీయూ లో నిపుణులైన వైద్యులు.. వైద్య సిబ్బంది సంరక్షణ.. ఆ తర్వాత డిశ్చార్జ్... ఇంటికి చేరుకోవడం' అనే కాప్షన్ ఇచ్చారు. అయితే దీనికి కింద అమితాబ్ రాసిన మాటలు చూసి, 83 సంవత్సరాల ఆయనకు శస్త్ర చికిత్స జరిగిందని, తదనంతర పరిణామాల గురించి ఆయన తన మనసులోని మాటలు చెప్పారని అంతా భావించారు. శస్త్ర చికిత్స ఎందుకు జరిగిందో అమితాబ్ చెప్పకుండా సస్పెన్స్ కు గురిచేశారని మరికొందరు వాపోయారు. ఇంకొందరు అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెట్టారు. అయితే... తన మాటలలోని నిగూఢతను అర్థం చేసుకోలేకపోయారని అమితాబ్ తాజాగా వివరణ ఇస్తూ మరో పోస్ట్ పెట్టారు.


'తనకు ఎలాంటి సర్జరీ జరగలేదని, ఆరోగ్యంగా ఉన్నాన'ని పేర్కొన్నారు. 'ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్స్ లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓటమిని, మెస్సి మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకుని తాను ఆ వ్యాఖ్యలు చేశానని, కానీ అందరూ తన ఆరోగ్యం గురించి అది పెట్టానని పొరపాటు పడ్డార'ని అమితాబ్ వివరణ ఇచ్చారు. అతి త్వరలోనే తాను 'కల్కి' సీక్వెల్ షూటింగ్‌లో పాల్గొన బోతున్నట్టు అమితాబ్ తెలిపారు. ఆయన వివరణతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా అమితాబ్ తన మనసులో మాటను డైరెక్ట్ గా చెప్పకుండా ఇలా ఇన్ డైరెక్ట్ గా పెట్టడం కరెక్ట్ కాదంటూ మరి కొందరు వాపోయారు.

ALSO READ:

స్పిరిట్ లో కత్రీనా కైఫ్.. ఏం ప్లాన్ చేశావయ్యా సందీపూ
బాలయ్యకు ప్రమాదం.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే

పెళ్లి తరువాత అక్కినేని కోడలు రీఎంట్రీ.. ఆ హీరోతో రొమాన్స్

Updated Date - Jul 22 , 2026 | 12:14 PM