సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jatadhara: ధనపిశాచిగా అదరగొట్టిన సోనాక్షి

ABN, Publish Date - Oct 01 , 2025 | 06:18 PM

సుధీర్ బాబు జటాధర సినిమా నుండి ధన పిశాచి పాట విడుదలైంది. దీనిని సోనాక్షి సిన్హాపై చిత్రీకరించారు. జటాదర చిత్రం నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.

Jatadhara Movie song

సుధీర్ బాబు (Sudheer Babu), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా 'జటాధర' (Jatadhara). ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీని వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ డైరెక్ట్ చేస్తున్నారు. హై-ఆక్టేన్ విజువల్స్ తో పౌరాణిక ఇతివృత్తాలతో గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్న ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మిస్తున్నారు. విజయదశమి కానుకగా ఈ సినిమా నుంచి ధన పిశాచి సాంగ్ రిలీజ్ చేశారు. సమీరా కొప్పికర్ పవర్ ఫుల్ ట్రాక్ కంపోజ్ చేయగా, శ్రీ హర్ష ఈమని సాహిత్యం సమకూర్చారు. సాహితీ చాగంటి ఇంటెన్స్ వోకల్స్ తో ఆకట్టుకున్నారు. ఈ సాంగ్ లో సోనాక్షి సిన్హా పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.


'జటాధర' మూవీలో ఇతర ప్రధాన పాత్రలను దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్‌ తదితరులు పోషించారు. ఈ సినిమా నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Updated Date - Oct 01 , 2025 | 06:20 PM