Jatadhara: పెళ్ళయ్యాక మారిపోయిన సోనాక్షి...

ABN , Publish Date - Sep 29 , 2025 | 10:51 AM

సుధీర్ బాబు 'జటాధర' చిత్రం నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఇందులో సోనాక్షి సిన్హా ధన పిశాచిగా కనిపించబోతోంది. ఆమెపై చిత్రీకరించిన పాటను అక్టోబర్ 1న రిలీజ్ చేయబోతున్నారు.

సుధీర్ బాబు (Sudheer Babu) ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా 'జటాధర' (Jatadhara). ఇది తెలుగుతో పాటు హిందీలోనూ రూపుదిద్దుకుంటోంది. సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'జటాధర'తో సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెడుతోంది. అలానే గతంలో తెలుగులో హీరోయిన్లుగా నటించిన శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా చాలా యేళ్ళ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. విశేషం ఏమంటే ఈ మధ్య కాలంలో జంట దర్శకుల సినిమాలు తెలుగులో పెరిగిపోయాయి. అలానే ఇప్పుడీ సినిమాను వెంకట్ కళ్యాణ్‌, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలను ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్‌, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్‌ కుమార్, శివిన్, అరుణ, శిల్పాసింగ్, నిఖిల్ నిర్మిస్తున్నారు.


మంచికి చెడుకి, వెలుగుకి చీకటికి, మానవ సంకల్పానికి విధికి మధ్య జరిగే పోరాట గాథ ఇదని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే విజయదశమి కానుకగా ఈ సినిమాలోని ఓ పాటను అక్టోబర్ 1న విడుదల చేస్తున్నారు. ఇందులో సోనాక్షి సిన్హా అందాల భామగా కాదు ధన పిశాచిగా నటిస్తోంది. ఆమెపైచిత్రీకరించిన పాటే 1వ తేదీ రాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. వివాహానంతరం సోనాక్షి సిన్హా రొటీన్ కు భిన్నమైన పాత్రలు చేయడం మొదలు పెట్టింది. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో తెరకెక్కిన 'నికితా రాయ్'లో టైటిల్ రోల్ ప్లే చేసిన సోనాక్షి ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఇప్పుడు 'జటాధర'పై ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Updated Date - Sep 29 , 2025 | 10:53 AM

Jatadhara First Look: విజువల్‌ వండర్‌గా జటాధర

Jatadhara: ప‌ర‌మ శివుడు లుక్‌లో.. కృష్ణకు ‘జటాధర’ నివాళి

Jatadhara: సుధీర్ బాబు సినిమాకు టైటిల్ ఫిక్సయింది.. మళ్లీ శివుడే!

Jatadhara: సుధీర్ బాబు సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్‌

Jatadhara: సుధీర్ బాబు, సోనాక్షి.. అద‌ర‌గొట్టారుగా