Jatadhara: ప‌ర‌మ శివుడు లుక్‌లో.. కృష్ణకు ‘జటాధర’ నివాళి

ABN , Publish Date - Jun 01 , 2025 | 09:05 PM

సుధీర్ బాబు క‌థానాయ‌కుడిగా రూపొందుతోన్న సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ ‘జటాధర’. షూటింగ్ చిత్రీక‌ర‌ణ‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది.

jatadhara

సుధీర్ బాబు (Sudheer babu) క‌థానాయ‌కుడిగా రూపొందుతోన్న సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ ‘జటాధర’ (Jatadhara). ఇప్ప‌టికే షూటింగ్ చిత్రీక‌ర‌ణ‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. శాస్త్రీయ, పౌరాణిక అంశాల మేళవింపుతో పాన్ ఇండియాగా రూపు దిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా (sonakshi sinha)తో పాటు శిల్పా శిరోద్క‌ర్‌, ర‌వి ప్ర‌కాష్‌, ఇంద్ర కృష్ణ‌, న‌వీన్ నేని, శుభ‌లేఖ సుధాక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, ఝాన్షీ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

GsRWUuobAAAJNLs.jpg

వెంకట్‌ కల్యాణ్‌ (Venkat Kalyan) దర్శకత్వం వహిస్తుండ‌గా.. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రేర‌ణ అరోరా, శివ‌న్ నారంగ్‌, అరుణ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్ష‌య్ క్రేజీవాల్‌, కుస్సుమ్ అరోరా స‌హ నిర్మాత‌లుగా, దివ్యా విజ‌య్ క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, భ‌వానీ గోస్వామి సూప‌ర్‌వైజింగ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హారిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా.. మే31న సూప‌ర్‌స్టార్ కృష్ణ (Super Star Krishna)జ‌యంతి సంద‌ర్భంగా.. ‘జ‌టాధ‌ర’ చిత్ర యూనిట్ ప‌ర‌మ శివుడు లుక్‌లో కృష్ణ లుక్‌ను రిలీజ్ చేసి నివాళులర్పించింది. ఈ సంద‌ర్భంగా అత‌నొక సూప‌ర్ స్టార్ మాత్ర‌మే కాదు, అత‌నో తుఫాన్‌, శ‌క్తి, వెండితెర దేవుడు, తిరుగులేని చ‌రిష్మా ఆయ‌న సొంతం ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా జ‌ఠాధ‌ర టీమ్ శివ రామ కృష్ణ మూర్తిగారికి సుల్యూట్ చేస్తుంది అంటూ సుధీర్‌బాబు ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసి కామెంట్ పెట్టాడు. ప్ర‌స్తుతం ఈ పోస్టు సోష‌ల్‌ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుండ‌గా శివుడి గెట‌ప్‌లో కృష్ణ గారు బావున్నారంటూ ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.

Updated Date - Jun 01 , 2025 | 09:05 PM