సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Paradha Second Single: సతీ సహగమనం.. అనుపమ మంచి కాన్సెప్ట్ తోనే వస్తుందిగా

ABN, Publish Date - Jul 17 , 2025 | 03:24 PM

అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పరదా. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంగీత, దర్శన రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Paradha

Paradha Second Single: జనరేషన్ మారుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం మారడం లేదు. ఇంకా పాతకాలపు మూఢనమ్మకాలతో మహిళలను వేధిస్తూనే ఉన్నారు. భర్త చనిపోతే ఆ చితిలోనే భార్య చనిపోయే సతీ సహగమనం ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఒక కాన్సెప్ట్ తోనే పరదా (Paradha) అనే సినిమా తెరకెక్కుతుంది. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పరదా. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంగీత, దర్శన రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఇక తాజాగా పరదా సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. యత్ర నార్యస్తు పూజ్యంతే రామంతే తత్ర దేవతా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఆడది ఎవరు.. ? ఆమెకు ప్రపంచంలో ఉన్న స్థానం ఏంటి.. ? కానీ, సమాజం ఆమెను ఎలా చూస్తుంది.. ? అసలు ఆడదాని సమాజం ఎలా చూడాలి.. ? అనే విషయాలను మొత్తం ఈ ఒక్క పాటలో పొందు పరిచారు. యత్ర నార్యస్తు పూజ్యంతే రామంతే తత్ర దేవతా అంటే.. ఎక్కడ స్త్రీలను గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. కానీ, కొన్ని మూఢనమ్మకాల వలన చాలామంది అసలు ఆడదాన్ని మనిషిగా చూడడం లేదని ఈ సాంగ్ లో చెప్పుకొచ్చారు.


వనమాలీ అందించిన లిరిక్స్ ఒక్కో పదం ఒక్కో తూటాలా కనిపిస్తుంది. ఇక ఆ లిరిక్స్ ను అంతే పవర్ ఫుల్ వాయిస్ తో ఆలపించాడు సింగర్ అనురాగ్ కులకర్ణి. మానవజాతికి పురుడు పోసిన బ్రహ్మరా.. ప్రణమిల్లరా. అమృతమూర్తిగా అవతరించిన అమ్మరా.. అపరంజిరా అనే లైన్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇక వీడియోలో అనుపమ భర్త చనిపోతే.. ఆమెను కూడా సతీసహగమనం చేయడానికి తీసుకెళ్తున్నట్లు చూపించారు. అనుపమను కాపాడడానికి సంగీత, రాగ్ మయూర్ ప్రయత్నిస్తున్నట్లు చూపించారు. ఇక సినిమా మొత్తానికి గోపి సుందర్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.


ఈమధ్యకాలంలో ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ ను డైరెక్టర్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఈ సాంగ్ లోనే కథ మొత్తాన్ని చూపించారు. కార్తికేయ 2 తరువాత నుంచి అనుపమ మంచి మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు చేరువ అవుతుంది. ఇక ఇప్పుడు మరోసారి పరదా సినిమా ఆమెకు మంచి బ్రేక్ ఇవ్వనుందని తెలుస్తోంది. ఆగస్టు 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా అనుపమకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Sobhanbabu: 50 ఏళ్ళ 'బలిపీఠం'

Bakasura Restaurant: వడ్డించడమే తరువాయి...

Genelia horror comedy: హారర్ కామెడీ మూవీలో హాసిని...

Updated Date - Jul 17 , 2025 | 03:26 PM