Genelia horror comedy: హారర్ కామెడీ మూవీలో హాసిని...

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:51 PM

'జూనియర్' మూవీతో 13 సంవత్సరాల తర్వాత దక్షిణాదిలోకి రీ-ఎంట్రీ ఇస్తోంది జెనీలియా. ఇటీవలే ఆమె నటించిన 'సితారే జమీన్ పర్' విడుదలైంది. అలానే మరో రెండు హిందీ సినిమాలనూ జెనీలియా చేస్తోంది.

Genelia D'souza

ప్రముఖ నటి జెనీలియా డిసౌజా (Genelia)... రితేష్ దేశ్ ముఖ్ (Ritesh Deshmukh) తో పెళ్ళి తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తోంది. ఇద్దరు పిల్లలు కాస్తంత పెరిగి, పెద్దవాళ్ళై చదువుల్లో పడిన తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే మధ్య లో ఒకటి రెండు వెబ్ సీరిస్ చేసిన జెనీలియా... కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. అలానే తన భర్త దర్శకత్వంలో 'వేడ్' (Ved) అనే మరాఠీ సినిమాలో నటించింది. ఇక తాజాగా ఆమె కీలక పాత్ర పోషంచిన 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par) ఇటీవలే విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


ఇప్పుడు పదమూడేళ్ళ తర్వాత కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కిన 'జూనియర్' (Junior) తో సౌతిండియాలోకి జెనీలియా అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను తెలియచేసింది. ఇక మీదట మంచి పాత్రలు లభిస్తే తప్పకుండా తెలుగులో నటిగా కొనసాగుతానని హామీ ఇచ్చింది. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ లో తన తొలి ఇన్నింగ్స్ లో నటించే అవకాశం రాలేదని, ఇప్పుడు ఆ కోరికను తీర్చుకోవాలని ఉందని తెలిపింది. ఈ నెల 18న విడుదల కాబోతున్న 'జూనియర్'లోని పాత్ర స్వభావాన్ని తెలియచేయకపోయినా... గతంలో తానెప్పుడు అలాంటి పాత్ర చేయలేదని, ఇదో బిజినెస్ ఉమెన్ పాత్ర అని తెలిపింది. హీరో కిరిటీ ఎంతో కష్టపడి తన పాత్రను చేశాడని, ఈ ప్రొడక్షన్ హౌస్ తమను ఎంతో బాగా చూసుకుందని, దాంతో సహజంగా హండ్రెడ్ పర్సంట్ ఎఫెర్ట్ పెట్టి తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చడానికి ప్రయత్నించానని జెనీలియా తెలిపింది.


ఇక ఇప్పటికే కమిట్ అయిన సినిమాల గురించి వివరిస్తూ... ఇంతవరకూ రామ్ గోపాల్ వర్మ (Ramgopal Varma) దర్శకత్వంలో నటించని తాను... తొలిసారి ఆయనతో మూవీ చేస్తున్నాని చెప్పింది. ఇదో హారర్ కామెడీ చిత్రమని, దీని షూటింగ్ హైదరాబాద్ లోనే జరగుతుందని జెనీలియా అంది. జెనీలియా లీడ్ రోల్ చేయబోతున్న ఈ సినిమాకు 'పోలీస్ స్టేషన్ మే భూత్' (Police Station Mein Bhoot) అనే టైటిల్ పెట్టారు. జెనీలియా కెరీర్ లోనే ఇదో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ కూడా చెప్పారు. అలానే ఆదిత్య దత్ దర్శకత్వంలో 'గన్ మాస్టర్ జి9' మూవీ చేస్తున్నానని జెనీలియా చెప్పింది. ఇమ్రాన్ హష్మీ, అపర్ శక్తి ఖన్నా, అభిషేక్ సింగ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది విడుదల కానుంది.

Also Read: DNA Tamil Movie: అసలేం జరుగుతోంది...

Also Read: Priyanka Mohan new movie: కవిన్ సరసన ప్రియాంక...

Updated Date - Jul 17 , 2025 | 12:55 PM