Bakasura Restaurant: వడ్డించడమే తరువాయి...
ABN , Publish Date - Jul 17 , 2025 | 01:25 PM
హాస్యనటుడు ప్రవీణ్ హీరోగా నటించిన సినిమా 'బకాసుర రెస్టారెంట్'. వైవా హర్ష టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ హంగర్ కామెడీ ఆగస్ట్ నెలలో జనం ముందుకు రాబోతోంది.
హాస్యనటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రవీణ్ (Praveen). అతనిప్పుడు హీరోగా నటిస్తున్నాడు. అదే 'బకాసుర రెస్టారెంట్' (Bakasura Restaurant). ఈ హారర్ కామెడీ మూవీలో వైవా హర్ష (VIVA Harsha) టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. అలానే కృష్ణ భగవాన్ (Krishna Bhagavan), షైనింగ్ ఫణి, కేజీఎఫ్ ఫేమ్ గరుడ రామ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. జె. శివ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మయ్య ఆచారి, జనార్దన్ ఆచారి ఈ సినిమాను నిర్మించారు. ఇదో హంగర్ కామెడీ ఎంటర్ టైనర్ అని మేకర్స్ చెబుతున్నారు.
'బకాసుర రెస్టారెంట్' మూవీకి వికాస బాడిగ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఆడియెన్స్ కు థిల్ ను అందిస్తుందని, ఓ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తో తీసిని సినిమా ఇదని దర్శకుడు శివ తెలిపాడు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 8న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు బాల సరస్వతి డీఓపీ కాగా, మార్తండ్ కె. వెంకటేశ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read: Genelia horror comedy: హారర్ కామెడీ మూవీలో హాసిని...
Also Read: DNA Tamil Movie: అసలేం జరుగుతోంది...