సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Aravind: అల్లు అర్జున్ ను మరచిపోవడమే కారణమా...!?

ABN, Publish Date - Aug 15 , 2025 | 08:16 PM

నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ లో తెలుగు సినిమా ఏడు అవార్డులను గెలుచుకుంది.  సైమా సంస్థ ఈ విన్నర్స్ ను సన్మానించింది... ఈ వేడుకలో పాల్గొన్న నోటెడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్  స్పీచ్ లో కొన్ని మాటలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి...

'ఎవరి కుంపటి వారిదే' అంటే ఐక్యత లేదనేగా...

అల్లు అర్జున్ ను మరచిపోవడమే కారణమా...

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలోని కీలక వ్యక్తుల్లో అల్లు అరవింద్ ఒకరు... ఇక ఆయన తనయుడు అల్లు అర్జున్ (Allu Arjun)ప్రస్తుతం ఇండియాలోని టాప్ స్టార్స్ లో ఒకరిగా సాగుతున్నారు... గురువారం జరిగిన సైమా అవార్డ్స్ (SIIMA Awards) కర్టన్ రైజర్ ఈవెంట్ లో అల్లు అరవింద్ 9Allu Aravind) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు... అదే వేదికపై 2023 సంవత్సరానికి గాను 71వ నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ లో ఏడు అవార్డులు గెలుచుకున్న విజేతలను సైమా సంస్థ సన్మానించింది... ఇలా గౌరవించడం అభినందనీయమని అల్లు అరవింద్ అన్నారు... మన తెలుగు సినిమా వారికి జాతీయ స్థాయిలో గౌరవం లభించినప్పుడు వారిని సన్మానించడం అన్నది గతంలో ఓ సంప్రదాయంగా జరుగుతూ ఉండేది... అది ఈ మధ్య కొరవడిందనే చెప్పాలి... ఆ విషయాన్నే అల్లు అరవింద్ తన ప్రసంగంలో గుర్తు చేశారు... ఆ సమయంలోనే 'ఇక్కడ ఎవరి కుంపటి వారిదే' అని అరవింద్ అనడంతో ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నారోనని చర్చ మొదలయింది..

అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సిరీస్ దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించాయి... దాంతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది... 'పుష్ప-1' సినిమాతో రెండేళ్ళ క్రితం అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా అవార్డు లభించింది... తెలుగులో ఓ నటునికి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు దక్కడం అదే మొదటిసారి... అంటే అల్లు అర్జున్ అరుదైన ఘనతను సాధించారన్న మాట... అలాంటి అల్లు అర్జున్ ను చిత్రసీమ సన్మానించక పోవడం వల్లే అల్లు అరవింద్ సైమా వేదికపై 'ఇక్కడ ఎవరి కుంపటి వారిదే' అని మాట్లాడారని కొందరు విశ్లేషిస్తున్నారు... అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు దక్కిన సమయంలోనే తెలుగు నుండి మరో తొమ్మిది అవార్డులు అందుకున్నవారున్నారు... ఆ సమయంలో తెలుగు సినిమా పరిశ్రమ నుండి వారికి ఎలాంటి సత్కారం లభించలేదు... ఈ సారి ఏడు అవార్డులు వచ్చినా వారిని సైమా గౌరవించడం అభినందనీయమని అరవింద్ నొక్కి చెప్పడం - అప్పట్లో ఇలా తన తనయునికి ఎవరూ సన్మానం చేయలేదన్న ఆవేదన వ్యక్తమయిందని పరిశీలకుల మాట...

ALSO READ: Tollywood Heroes: బాలీవుడ్ డైరెక్టర్స్ ను నమ్మడమే వీరు చేసిన తప్పా



తెలుగు సినిమారంగం మద్రాసులో ఉండగా, మనవాళ్ళకు అంతగా జాతీయ అవార్డులు లభించలేదు... అయితే తెలుగువారికి నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ దక్కిన ప్రతీసారి చిత్రసీమ ఎంతగానో గౌరవించేది... హైదరాబాద్ కు చిత్రపరిశ్రమ మారిన తరువాత అలాంటి సంప్రదాయం మెల్లగా కరిగిపోయింది... ఏయన్నార్ కు సైతం పద్మవిభూషణ్ వచ్చినప్పుడు చిత్రపరిశ్రమ స్పందించక పోవడంపై అప్పట్లో పలు విమర్శలు వినిపించాయి... తెలుగు సినిమారంగంలో ఓ నటుడు మొట్టమొదటిసారి జాతీయ స్థాయిలో బెస్ట్ యాక్టర్ గా ఎన్నికైనా సినిమారంగం స్పందించక పోవడం నిస్సందేహంగా విచారకరమని కొందరు అంటున్నారు... ఏది ఏమైనా అల్లు అరవింద్ అన్న మాటలు ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో చర్చగా మారాయి... ఇక మీదటనైనా తెలుగు సినిమావాళ్ళకు ఎక్కడ గౌరవం దక్కినా దానిని టాలీవుడ్ సెలబ్రేట్ చేసుకొనే సంప్రదాయం మళ్ళీ రావాలనే పలువురు కోరుకుంటున్నారు... భవిష్యత్ లో తెలుగు సినిమారంగం ఆ తీరున సాగుతుందేమో చూద్దాం..

ALSO READ: Rajnikanth: రజనీ తొలి సినిమా 'అపూర్వ రాగంగళ్'కు 50 ఏళ్ళు...

Kasthuri Shankar: బీజేపీలో చేరిన కాంట్రవర్సీ క్వీన్

Rashmika: రశ్మిక మూవీలో నోరా, మలైకా

Sir Madam - ott: 'సార్‌ మేడమ్‌’.. ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!


Updated Date - Aug 15 , 2025 | 09:02 PM