Sir Madam - ott: 'సార్ మేడమ్’.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:37 PM
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సార్ మేడమ్' సినిమా .. ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అయింది.
విజయ్ సేతుపతి (Vijay Sethupathi), నిత్యా మేనన్ (Nithya Menon) జంటగా నటించిన చిత్రం ‘తలైవా తలైవి’. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యోగిబాబు, రోషిని హరిప్రియన్ తదితరులు నటించారు. తెలుగులో ‘సార్ మేడమ్’ (Sir Madam) టైటిల్ తో విడుదల చేశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా .. ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అయింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా (Amazon Prime video) ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పోస్టర్ విడుదల చేసి తెలిపింది.
కథ: (Thalaivan Thalaivii Story)
ఆకాశవీరయ్య (విజయ్ సేతుపతి), అతని కుటుంబం సొంత ఊళ్లోనే హోటల్ నడుపుతుంటారు. వీరయ్య పరాటా చేయడంలో ఎక్స్‌పర్ట్. అతని పెళ్లి కోసం పక్క ఊరిలో ఓ అమ్మాయిని చూస్తారు. ఆమె పేరు రాణి (నిత్యా మీనన్). పెళ్లి చూపుల్లోనే ఆమెపై మనసు పారేసుకుంటాడు వీరయ్య. వీరిద్దరి పెళ్లికి మొదట ఇరు కుటుంబాలు అంగీకరించినా కుటుంబ నేపథ్యం తెలిసి పెళ్లి చేయడానికి నిరాకరిస్తారు. వీరయ్య, రాణి ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఇంట్లో పెళ్లి కాదనడంతో పారిపోయి పెళ్లి చేసుకుంటారు. కొన్నాళ్లు ఈ జంట వైవాహిక జీవితం సాఫీగానే ఉన్నా.. తర్వాత రెండు కుటుంబాల్లోని ఆడవాళ్ల వల్ల గొడవలు మొదలై అవి పెరిగి పెద్దవై విడాకుల దాకా తీసుకొస్తాయి. ఆ తర్వాత ఏమైంది? వీరయ్య, రాణి ఒకటయ్యారా లేదా అన్నది కథ.