Vijay Antonys 25th Film: విడుదలకు సిద్ధం
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:54 AM
హీరో విజయ్ ఆంటోని నటిస్తున్న 25వ చిత్రం ‘భద్రకాళి’. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా అరుణ్ ప్రభు తెరకెక్కిస్తున్నారు. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు...
హీరో విజయ్ ఆంటోని నటిస్తున్న 25వ చిత్రం ‘భద్రకాళి’. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా అరుణ్ ప్రభు తెరకెక్కిస్తున్నారు. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి నిర్మిస్తున్నారు. ఇటీవలె విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. వచ్చే నెల 19న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్‌మెంట్స్, స్పిరిట్ మీడియా సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.