VAYUPUTRA: కేవలం సినిమా కాదు, ఒక పవిత్ర దృశ్యం
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:57 PM
'కార్తికేయ -2' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న చందూ మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, శ్రీకర్ ప్రొడక్షన్స్ తో కలిసి 'వాయుపుత్ర' పేరుతో త్రీడీ యానిమేషన్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది దసరా కానుకగా ఐదు భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
'మహావతార్ నరసింహా' (Mahavatar Narasimha) సినిమా సాధించిన విజయంతో అందరి దృష్టీ ఇప్పుడు త్రీ డీ యానిమేషన్ పై పండింది. అందులో తొలి అడుగును తెలుగులో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ వేసింది. 'కార్తికేయ -2' (Karthikeya -2) సినిమా తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న చందూ మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi), సాయి సౌజన్య (Sai Soujanya), శ్రీకర్ ప్రొడక్షన్స్ తో కలిసి 'వాయుపుత్ర' (Vaayuputra) పేరుతో త్రీడీ యానిమేషన్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది దసరా కానుకగా ఐదు భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమా గురించి నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, 'మన చరిత్ర, ఇతిహాసాలలో వాయుపుత్రుడు హనుమంతుడు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంతుడు... తన బలం, భక్తితో కాలాన్ని అధిగమించిన శాశ్వత యోధుడు. అలాంటి గొప్ప యోధుడి కథతో 'వాయుపుత్ర' చిత్రం రూపొందుతోంది. ఇది పర్వతాలను కదిలించిన భక్తి కథ కూడా. ఇది తరాలను తీర్చిదిద్దిన, ప్రేరేపించిన హనుమంతుడి అచంచల విశ్వాసాన్ని సంగ్రహిస్తుంది' అని అన్నారు. భారీస్థాయిలో 3డీ యానిమేషన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న 'వాయుపుత్ర', హనుమంతుని కాలాతీత కథను గొప్ప దృశ్యకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుందని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సైతం ఆకట్టుకునేలా ఉంది. హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను చూస్తున్న శక్తివంతమైన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇది కేవలం సినిమా కాదు, థియేటర్లను దేవాలయాలుగా మార్చే పవిత్ర దృశ్యమని, మునుపెన్నడూ లేని విధంగా భక్తి పారవశ్యంలో ముంచేయడానికి ప్రేక్షకులను ఆహ్వానిస్తోందని నాగవంశీ తెలిపారు.
Also Read: 96 Sequel: దర్శకుడి జాబితా నుండి మిస్ అయిన సీక్వెల్
Also Read: Karishma Kapoor: దివంగత తండ్రి ఆస్తి హక్కుల కోసం...