96 Sequel: దర్శకుడి జాబితా నుండి మిస్ అయిన సీక్వెల్

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:10 PM

దర్శకుడు ప్రేమ్ కుమార్ '96' మూవీ సీక్వెల్ ఉండదనే విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశాడు. అతను ప్రకటించిన మూడు కొత్త ప్రాజెక్ట్స్ లో విజయ్ సేతుపతి, త్రిష మూవీ 96 సీక్వెల్ లేకపోవడంతో ఈ విషయం రూఢీ అయ్యింది.

No more 96 Sequel

ఫిల్మ్ మేకర్స్ తమ నిర్ణయాలను చాలా తెలివిగా జనాలకు తెలియచేస్తుంటారు. ఎక్కడైన అది వివాదానికి దారితీస్తుందేమో అనే సందేహం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ తెలివితేటలను ఉపయోగిస్తారు. అదే పని ప్రముఖ తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ (Prem Kumar) కూడా చేశాడు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), త్రిష (Trisha) జంటగా ఆయన తెరకెక్కించిన రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీ '96' (96 movie) ఏ స్థాయి విజాయన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా తెలుగులోనూ 'జాను' (Jaanu) పేరుతో రీ-మేక్ అయ్యింది. ఇక్కడ శర్వానంద్ (Sharwanand), సమంత (Samantha) జంటగా నటించారు. అయితే తెలుగులో మాత్రం '96' మ్యాజిక్ ను ప్రేమ్ కుమార్ రిపీట్ చేయలేకపోయాడు.


ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ప్రేమ్ కుమార్ 'సత్యం సుందరం' (Satyam Sundaram) పేరుతో మరో సినిమాను రూపొందించాడు. ఇది కూడా చక్కని ఆదరణ పొందింది. కార్తీ (Karthi), అరవింద్ స్వామి (Aravind Swamy) ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా చూసి... ప్రేమ్ తన మార్క్ ను ఇందులోనూ చూపించాడని అంతా అనుకున్నారు. ఇక ఆ తర్వాత ప్రేమ్ కుమార్ '96' కు సీక్వెల్ తీయబోతున్నాడని, దానిలోనూ విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తారని వార్త వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని కోలీవుడ్ అంతా ఎదురుచూసింది. అయితే... ఇప్పుడా సినిమా లేదనే వార్త తెలిసింది. ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా ప్రేమ్ తన ప్రకటన ద్వారా తెలిపాడు.


హీరో విజయ్ సేతుపతి, దర్శకుడు ప్రేమ్ కుమార్ మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెన్స్ కారణంగా '96' మూవీ సీక్వెల్ ఆగిపోయిందని తెలుస్తోంది. ఈ సీక్వెల్ ప్రకటన రాగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బులైన అభిమానులు ఇప్పుడీ తాజా పరిణామంతో డీలా పడిపోయారు. దర్శకుడు ప్రేమ్ కుమార్ తాను అంగీకరించిన సినిమాల వివరాలను ఇలా తెలియచేశాడు. అందులో మొదటిది తొమ్మిది ప్రధాన పాత్రలతో తీయబోతున్న అడ్వంచర్ సర్వైవల్ డ్రామా. ఇక రెండోది యాక్షన్ థ్రిల్లర్. ఇందులో ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించబోతున్నాడు. హీరోయిన్ పాత్రలేని ఓ లవ్ స్టోరీని సిద్థం చేసుకున్నాడు. ఈ జాబితా చూసిన తర్వాత ఇందులో '96' సీక్వెల్ లేకపోవడంతో దానిని డ్రాప్ చేసినట్టు ప్రేమ్ కుమార్ చెప్పకనే చెప్పాడని తెలుస్తోంది. దీనిపై విజయ్ సేతుపతి లేదా త్రిషా ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

Also Read: Bollywood: యాక్షన్ హీరోగా బాలీవుడ్ లోకి ధోని...

Also Read: Karishma Kapoor: దివంగత తండ్రి ఆస్తి హక్కుల కోసం...

Updated Date - Sep 10 , 2025 | 12:12 PM