Mahavatar Narsimha: గూస్ బంప్స్ తెప్పిస్తున్న హిరణ్యకశిపుడి ప్రోమో
ABN , Publish Date - Jul 01 , 2025 | 03:36 PM
కెజిఎఫ్, కాంతార, సలార్ సినిమాలతో హోంబాలే ఫిల్మ్స్ ఇండస్ట్రీలో తమనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి.
Mahavatar Narsimha: కెజిఎఫ్, కాంతార, సలార్ సినిమాలతో హోంబాలే ఫిల్మ్స్ ఇండస్ట్రీలో తమనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇక నుంచి తమ సంస్థ నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించాలనే ఉంటుంది అని చెప్పిన హోంబాలే (Hombale Films) .. దానికి తగ్గట్లుగానే సినిమాలు చేస్తూ వచ్చింది. తాజాగా ఈ సంస్థ నుంచి వస్తున్న చిత్రం మహావతార్ నరసింహా. యానిమేటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కుతున్న మొదటి చిత్రం నరసింహా. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి హిరణ్యకశిప పాత్రను పరిచయం చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. రాక్షసరాజుగా హిరణ్యకశిపుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమరత్వం పొందాలని ఆశతో బ్రహ్మను పూజించి ఆయన వద్దనుంచి వరం పొందుతాడు. హిరణ్యకశిపుడును ఎవరూ చంపలేరు. దీంతో తనను తానే దేవుడిగా భావించి దేవతలకే సవాలు విసురుతాడు. తనను తప్ప ఇంకెవరిని దేవుడిగా కొలువకూడదని ప్రజలను హింసిస్తూ ఉంటాడు. ఇక అతని కొడుకే ప్రహ్లాదుడు. విష్ణువు భక్తుడు. విష్ణువును కొలవడం ఆపమని చెప్పినా ప్రహ్లదుడు వినకుండా ఉండడంతో సొంత కొడుకునే చంపడానికి పూనుకుంటాడు. అప్పుడు అతడిని కాపాడడానికి లక్ష్మీ నరసింహా స్వామి వస్తాడు.
ఇక ఇప్పుడు ఇదే కథను మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. అధర్మానికి రూపం అంటూ హిరణ్యకశిపుడును చూపించారు. ఈ వీడియోలోరాక్షస రాజు.. ప్రజలను హింసించడం, తనను తాను దేవుడిగా చెప్పుకోవడం, విష్ణువుతో సవాల్ చేయడం లాంటివి చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జూలై 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో హోంబాలే ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Rashmika Mandanna: సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిన రష్మిక.. ఏకిపారేస్తున్న నెటిజన్స్