సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Constable Kanakam Trailer: వేటాడితే బెదరడానికి అది జింక కాదు.. ఉత్కంఠ రేపుతున్న కానిస్టేబుల్ కనకం ట్రైలర్

ABN, Publish Date - Aug 08 , 2025 | 09:33 PM

విభిన్నమైన కథలతో ఓటీటీలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్న ఓటీటీ ఈటీవీ విన్. సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా మంచి మంచి కథలతో ఈటీవీ ఒరిజినల్స్ ను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

Constable Kanakam

Constable Kanakam Trailer: విభిన్నమైన కథలతో ఓటీటీలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్న ఓటీటీ ఈటీవీ విన్. సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా మంచి మంచి కథలతో ఈటీవీ ఒరిజినల్స్ ను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక తాజాగా ఈటీవీ విన్ లో వస్తున్న చిత్రం కానిస్టేబుల్ కనకం(Constable Kanakam). వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) ప్రధాన పాత్రలో ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో తెరకెక్కిన కానిస్టేబుల్ కనకం సినిమాను కోవెలమూడి సత్య సాయిబాబా, హేమంత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్ని బావుంటే ఈపాటికి కానిస్టేబుల్ కనకం స్ట్రీమింగ్ కూడా అయ్యేది. కానీ, ఇలాంటి కాన్సెప్ట్ తోనే జీ5 లో విరాటపాలెం సిరీస్ కూడా రావడంతో.. కాపీ కేసు పెట్టడంతో ఈ సినిమా కొన్నిరోజులు ఆగింది.


ఇక ఇప్పుడు కానిస్టేబుల్ కనకం స్ట్రీమింగ్ కు సిద్దమయ్యింది. ఆగస్టు 14 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కానిస్టేబుల్ కనకంగా వర్ష బొల్లమ్మ కనిపిస్తుంది. ఒక బుర్ర కథ చెప్పినట్లు ఈ కథ లైన్ ను చెప్పుకొచ్చారు. రేపల్లె అనే ఊరులో ఒక అడవి.. అక్కడ ఒక గుట్ట ఉంటుంది. అక్కడ ఏం జరిగింది. అక్కడ ఉన్న పులి, సింహం లాంటి క్రూర మనస్తత్వం ఉన్న మనుషులు జింక లాంటి అమ్మాయిని ఏం చేశారు.. ?


జింక అనుకోని వారు పొరపడ్డారా.. ? ఆమె జింక కాదు.. భద్రకాళి అని తెలిసేలా ఆమె ఏం చేసింది.. ? చివరకు ఆ ఊరులో జరిగే వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరో ఈ జింక కనిపెట్టిందా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సేమ్ విరాటపాలెం కథలానే అనిపిస్తున్నా.. ఈసారి మేకర్స్ కానిస్టేబుల్ కనకం కు కొద్దిగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలను గుప్పించేశారు. కానిస్టేబుల్ కనకంగా వర్ష చాలా డేరింగ్ గా నటించింది. ట్రైలర్ ను కట్ చేసిన విధానం చూస్తే విరాటపాలెం చూసినట్లు కనిపించడం లేదు. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపైన అంచనాలను పెంచేశారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Shiva Re-Release: అక్కినేని ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్.. కూలీతో పాటే శివ

Chai Waala: శివ కందుకూరి కొత్త సినిమా...

Updated Date - Aug 08 , 2025 | 09:33 PM