Shiva Re-Release: అక్కినేని ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్.. కూలీతో పాటే శివ

ABN , Publish Date - Aug 08 , 2025 | 08:11 PM

ప్రతి నటుడికి వారి కెరీర్ లో ఒక ఐకానిక్ సినిమా.. ఒక ఐకానిక్ రోల్ ఉంటుంది. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కెరీర్ లో అలాంటి ఐకానిక్ రోల్ అంటే టక్కున శివ (Shiva) అని చెప్పుకొస్తారు.

Shiva

Shiva Re-Release: ప్రతి నటుడికి వారి కెరీర్ లో ఒక ఐకానిక్ సినిమా.. ఒక ఐకానిక్ రోల్ ఉంటుంది. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కెరీర్ లో అలాంటి ఐకానిక్ రోల్ అంటే టక్కున శివ (Shiva) అని చెప్పుకొస్తారు. నాగార్జున లైఫ్ శివకు ముందు.. శివ తరువాత అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నాగార్జునను అభిమానులకు దగ్గర చేసింది శివనే. ఇప్పటికీఆయన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించవచ్చు.. ఎన్నో ప్రయోగాలు చేయవచ్చు. శివ మాత్రం ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. అలాంటి ఐకానిక్ సినిమా ఇప్పుడు మరోసారి అభిమానులను అలరించాచడానికి సిద్దమవుతుంది.


ఈమధ్యకాలంలో కొత్త సినిమాల కంటే పాత సినిమాల రీరిలీజ్ లే రచ్చ చేస్తున్న విషయం తెల్సిందే. అయితే అన్ని సినిమాలు వస్తున్నా.. శివ మాత్రం రిరిలీజ్ కావడం లేదు.ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిరిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా అక్కినేని నాగార్జున.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చాడు. ఆగస్టు 14 న నాగార్జున నటించిన కూలీ సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు నాగ్.. ఆ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు.


శివ సినిమా రీరిలీజ్ కాబోతుందని శుభవార్తతో పాటు.. కూలీ సినిమా థియేటర్ లోనే శివ 4కె ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్లు 4K డాల్బీ అట్మోస్ సౌండ్ తో ఈ ట్రైలర్ ఉండబోతుంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. ఇక ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ.. 'శివ చిత్రం నాకు ఒక ఐకానిక్ హీరో హోదాను ఇచ్చింది, నా పాత్రను మరపురానిదిగా చేసింది. ఇన్నేళ్లు అయినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాను మర్చిపోలేకపోవడం నన్ను మళ్లీ శివను రీ రిలీజ్ చేయడానికి ప్రేరేపించింది. దీనిని ఇంత కల్ట్ క్లాసిక్‌గా మార్చిన ప్రేక్షకులకు మరియు యూట్యూబ్ లో మాత్రమే చూసిన కొత్త తరానికి మేము రుణపడి ఉన్నాం. కాబట్టి RGV, వెంకట్ మరియు నేను 4K విజువల్స్‌తో అపూర్వమైనడాల్బీ అట్మోస్ సౌండ్ అనుభవంతో ప్రేక్షకులకు మరోసారి శివను అందించాలని నిర్ణయించుకున్నాము' అంటూ చెప్పుకొచ్చాడు.


డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. 'నాగార్జున, నిర్మాతలు నాపై ఉంచిన నమ్మకమే ఈ సినిమా ఇంత గొప్ప శిఖరాలకు చేరుకోవడానికి సహాయపడింది. నేటికీ ప్రజలు ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని, పాత్రను గుర్తుంచుకున్నారు అంటే నమ్మలేకపోతున్నాను. శివను మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ తిరిగి విడుదల చేయాలనే నిర్ణయం నన్ను నిజంగా థ్రిల్ చేసింది. అంతకు ముందు శివ వేరు.. ఇప్పుడు రిలీజ్ అవుతున్న శివ వేరు. 4K డాల్బీ అట్మోస్ సౌండ్ తో ఈ శివ మరింత అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి శివ ఇప్పుడు ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Chai Waala: శివ కందుకూరి కొత్త సినిమా...

Kaantha: 'పసి మనసే'.. కెమిస్ట్రీ బాగా కుదిరినట్టుందిగా

Updated Date - Aug 08 , 2025 | 08:11 PM