Chai Waala: శివ కందుకూరి కొత్త సినిమా...

ABN , Publish Date - Aug 08 , 2025 | 07:23 PM

యువ కథానాయకుడు శివ కందుకూరి కొత్త సినిమాకు 'చాయ్ వాలా' అనే పేరు పెట్టారు. తాజాగా ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.

Chai Walaa Movie

చాయ్ వాలా (Chai Waala) అనగానే ఠక్కున అందరికీ గుర్తొచ్చే పేరు భారతదేశ ప్రధాని మోదీ! చాయ్ వాలాగా మొదలైన ఆయన జీవితం ప్రధాని పదవిని అధిష్టించే వరకూ చేరింది. తొలిసారి మోదీ ఎన్నికల్లో 'చాయ్ పే చర్చ' అంటూ ఓ కొత్త బాణీని పలికారు. ఇక మోదీ విషయాన్ని పక్కన పెడితే... తెలుగులోనూ ఓ చాయ్ వాలా కొత్తగా తెర మీదకు వస్తున్నాడు. అతనే శివ కందుకూరి (Shiva Kandukuri).


ఇప్పటికే పలు చిత్రాలలో నటించి, నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న శివ కందుకూరి తాజా చిత్రానికి 'చాయ్ వాలా' అనే పేరు ఖరారు చేశారు. ఈ సినిమాను హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాధా విజయలక్ష్మీ, వెంకట్ ఆర్. పాపుడిప్పు నిర్మిస్తున్నారు. దీనికి రచన చేస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు ప్రమోద్ హర్ష. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో శివ కందుకూరి, రాజీవ్ కనకాల (Rajeev Kanakala) స్కూటీపై జాలీగా తిరుగుతూ కనిపిస్తున్నారు. దీనిని చూస్తుంటే హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథలా అనిపిస్తోంది. ఈ ఫోటోలోని వారి హ్యాపీనెస్ ఆడియెన్స్ కు ఇట్టే కనెక్ట్ అయిపోతుంది. ఈ సినిమా గురించి మేకర్స్ మాట్లాడుతూ, 'ఈ కథ ప్రేమ, వారసత్వం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. ఓ పర్ఫెక్ట్ చాయ్, కప్పులా ఉంటుంది. భావోద్వేగాలు, సంప్రదాయం, కలలతో నిండిన అద్భుతమైన ప్రయాణాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి. టీజర్ అతి త్వరలో వస్తుంది’ అని తెలిపారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి (Prashanth R. Vihari) సంగీతం సమకూరుస్తుండగా, క్రాంతి వర్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పవన్ నర్వా ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Also Read: Kaantha: 'పసి మనసే'.. కెమిస్ట్రీ బాగా కుదిరినట్టుందిగా

Also Read: Bakasura Restaurant Review: 'బకాసుర రెస్టారెంట్‌' ఎలా ఉందంటే..

Updated Date - Aug 08 , 2025 | 07:33 PM

Rajeev Kanakala: చిన్ననాటి రోజులు, లవ్‌స్టోరీలు గుర్తొస్తాయి..

Tollywood 'Tara' Juvvalu : టాలీవుడ్‌ ‘తారా’జువ్వలు

Tollywood Actress: కేబీఆర్ పార్క్‌లో నటిని వెంబడించి వేధించిన యువకుడు.. పోలీసుల విచారణ ఏం తేలిందంటే..

Tollywood : హీరోయిన్లు దొరికినట్టేనా?

Telugu Cinema Budgets: పరభాషా నటుల పారితోషికం కోట్లకి వెళ్ళింది!