Kishkindhapuri: ఉండిపోవే నాతోనే.. ‘కిష్కిందపురి’ మూవీ నుంచి లిరికల్ సాంగ్
ABN , Publish Date - Aug 07 , 2025 | 10:40 PM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న ఫాంటసీ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధ పురి’
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా తెరకెక్కుతున్న ఫాంటసీ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధ పురి’ (Kishkindhapuri). తాజాగా ఈ సినిమా నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ మంచి ఆదరణను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘ఉండిపోవే నాతోనే’ అనే లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj)సంగీతం సమకూర్చిన ఈ పాటకు పూర్ణ చారి సాహిత్యం అందించగా, జావేద్ అలీ ఆలపించారు. సముద్రం ఒడ్డున అందమైన లోకేషన్లలో చిత్రీకరించిన పాగ మంచి మెలోడియస్‌గా సాగుతూప్రేక్షకులను ఆకట్టుకుంది. దసరా, దీపావళి సమయంలో ఈ చిత్రం థియేటర్లకు రానుంది. ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.