Atharvaa Murali: 'టన్నెల్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది...
ABN , Publish Date - Sep 04 , 2025 | 03:38 PM
అధర్వ మురళీ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా 'టన్నెల్'. ఈ నెల 12న మూవీ రిలీజ్ కాబోతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.
అథర్వ మురళీ (Atharvaa Murali) నటించిన తాజా చిత్రం 'టన్నెల్' (Tunnel). ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నాయికగా నటించింది. అథర్వ మురళీ యాక్ట్ చేసే సినిమాలు వైవిధ్యంతో ఉంటాయని ఇటీవల వచ్చిన 'డి.ఎన్.ఎ.' (DNA) నిరూపించింది. ఇప్పుడూ అలాంటి భిన్నమైన కథనే 'టన్నెల్'తో అథర్వ మురళీ ఎంచుకున్నాడు. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశ్విన్ కాకుమాను విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీని తెలుగులోకి లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా ఎ. రాజు నాయక్ విడుదల చేస్తున్నారు.
తాజాగా విడుదలైన 'టన్నెల్' మూవీ ట్రైలర్ అంచనాలను పెంచేవిధంగా ఉంది. 'యూనిఫామ్ వేసుకున్న తరువాత అందరూ ఫ్యామిలీనే' అని ట్రైలర్ లో హీరో చెప్పిన డైలాగ్ చూస్తే 'టన్నెల్' సినిమా ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. ఇందులో సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ కి ఎంత ప్రాధాన్యత ఉందో, లవ్ ట్రాక్ కి కూడా అంతే ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి, అధర్వ కాంబో అందరినీ అలరించేలా ఉంది. జస్టిన్ ప్రభాకరన్ (Justin Prabhakaran) సంగీతం అందించిన ఈ సినిమా శక్తి శరవణన్ సినిమాటోగ్రాఫర్. తెలుగు ప్రమోషన్స్ ను అతి త్వరలోనే మొదల పెట్టబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.
Also Read: Avatar 3D: ది వే ఆఫ్ వాటర్ అక్టోబర్ 2న రీ-రిలీజ్
Also Read: Ghaati: అదిరిన గ్లింప్స్.. క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు కోలాహలం..