Ghaati: అదిరిన గ్లింప్స్‌.. క్వీన్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ అభిమానులు కోలాహలం..

ABN , Publish Date - Sep 04 , 2025 | 03:22 PM

‘వాళ్లు ఊరుకోరు, వీళ్ళు ఊరుకోరు అంటే నేను ఊరుకోను’ అని సింపుల్‌గా చెప్పిన డైలాగ్‌ కథ, ఆమె పాత్రలో ఉన్న డెప్త్‌ని తెలియజేస్తుంది. కర్ర తిప్పుడు నుంచి కత్తి పట్టి ఊచ కోత వరకూ అలరించేలా ఉంది. క

Anushka - Ghaati

అనుష్క (Anushka) ‘ఘాటి’ (Ghaati) చిత్రంతో ఈ శుక్రవారం ప్రేక్షకులను పలకరించనుంది. విక్రమ్‌ ప్రభు కీలక పాత్రలో క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించిన చిత్రమిది. అనుష్క ఇందులో శీలావతి పాత్రలో కనిపించనుంది. గురువారం ప్రభాస్‌ చేతుల మీదుగా ఈ సినిమా రిలీజ్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. 1:27 నిమిషాల నిడివి గల గ్లింప్స్‌లో అనుష్క విజృంభించినట్లు చూపించారు. ఒక బాధితురాలు, నేరస్తురాలు అయిన మహిళ లెజెండ్‌గా ఎలా మారింది అన్న బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. ‘వాళ్లు ఊరుకోరు, వీళ్ళు ఊరుకోరు అంటే నేను ఊరుకోను’ అని సింపుల్‌గా చెప్పిన డైలాగ్‌ కథ, ఆమె పాత్రలో ఉన్న డెప్త్‌ని తెలియజేస్తుంది. కర్ర తిప్పుడు నుంచి కత్తి పట్టి ఊచ కోత వరకూ అలరించేలా ఉంది. కథను యాక్షన్‌కే పరిమితం చేయకుండా, ఓ సమస్య దానిపై పోరాటం నేపథ్యంలో దర్శకుడు ముందుకు తీసుకెళ్లాడు. ఇప్పటికే అనుష్క ఈ తరహా యాక్షన్‌ తరహా చాలానే చేసి మెప్పించింది. అయితే అవన్నీ డిఫరెంట్‌ జానర్‌ చిత్రాలు. అనుష్క చేసిన చిత్రాల్లో ఇది కాస్త భిన్నమనే చెప్పాలి.

తూర్పుకనుమలు, గంజాయి నేపథ్యం, పర్వతాలు, అక్కడి కల్చర్‌ ఇవన్నీ విజువల్‌గా ఫ్రెష్‌నెస్‌ తీసుకొచ్చాయి. టీజర్‌లో బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అదిరింది. దానికి వాడిన ఇంగ్లిష్‌ ట్యూన్‌ కూడా క్యాచీగా ఉంది. కర్ర తిప్పే సీన్‌ నుంచి కొడవలి పట్టుకుని బస్సు వెనుక నడచి వెళ్లే షాట్స్‌లో అనుష్కలో వీరత్వం కనిపించింది. తల తెగేసి ఆ తల పట్టుకుని నడిచి వస్తున్న సీన్‌తో సినిమాలో ఊచకోత ఉండబోతుందని అర్థమవుతుంది. గ్లింప్స్‌ చివర్లో ‘వాళ్లు ఊరుకోరు.. వీళ్లు ఊరుకోరు అంటే.. నేను ఊరుకోను’ అంటూ చివర్లో అనుష్క చెప్పిన మాస్‌ డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. క్రిష్‌ మేకింగ్‌, టేకింగ్‌ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. జగపతిబాబు, విక్రమ్‌ ప్రభు పాత్రలు కథకు అదనపు బలం అనేలా ఉన్నాయి. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్‌ చూశాక స్వీటీకి ఇది నెవర్‌ బిఫోర్‌ రోల్‌ అనేలా ఉంది. ఈ చిన్న గ్లింప్స్‌తో అనుష్క ఈజ్‌ బ్యాక్‌ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - Sep 04 , 2025 | 03:22 PM