Lavanya Konidela: బేబీ బంప్ తో మెగా కోడలు.. భర్త పక్కన ఎంత అందంగా ఉందో
ABN , Publish Date - Aug 27 , 2025 | 09:27 PM
దేశమంతటా వినాయక చవితి సంబురాలు అంబరాన్ని అంటాయి. ప్రతి ఒక్కరు బొజ్జ గణపయ్యను తమ ఇంటికి ఆహ్వానిస్తున్నారు.
Lavanya Konidela: దేశమంతటా వినాయక చవితి సంబురాలు అంబరాన్ని అంటాయి. ప్రతి ఒక్కరు బొజ్జ గణపయ్యను తమ ఇంటికి ఆహ్వానిస్తున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం ఉదయం నుంచి తమ పూజకు ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తన భార్య లావణ్య(Lavanya) తో కలిసి పూజ చేస్తున్న ఫోటోను షేర్ చేశాడు.
లావణ్య ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెల్సిందే. మొట్ట మొదటిసారి ఆమె బేబీ బంప్ తో అధికారికంగా కనిపించింది. బ్లూ కలర్ డ్రెస్ లో దేవుని ముందుచిన్న కుర్చీలో లావణ్య కూర్చొని ఉండగా.. ఆమె ఎదురు కింద వరుణ్ డిజైనర్ కుర్తాలో కనిపించాడు. ఇద్దరి జంట ఎంతో చూడముచ్చటగా ఉంది. ఈ ఫోటో చూసిన అభిమానులు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే వరుణ్ - లావణ్య లవ్ స్టోరీ గురించి అందరికీ తెల్సిందే. మిస్టర్ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.
పెళ్లి తరువాత కూడా లావణ్య నటిస్తుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం సతి లీలావతి. ఈమధ్యనే ఈ సినిమా నుంచి టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ఇక వరుణ్ విషయానికొస్తే.. ఒక మంచి హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక కొరియన్ హర్రర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో వరుణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.