Tollywood: చిరంజీవి ఇంట్లో ముగిసిన నిర్మాతల మీటింగ్..
ABN, Publish Date - Aug 05 , 2025 | 06:07 PM
సినీ కార్మికుల బంద్‌పై చర్చించడానికి టాలీవుడ్ నిర్మాతలంతా కలిసి చిరంజీవిని (Chiranjeevi) కలిశారు.
సినీ కార్మికుల బంద్‌పై చర్చించడానికి టాలీవుడ్ (tollywood) నిర్మాతలంతా కలిసి చిరంజీవిని (Chiranjeevi) కలిశారు. వేతనాల పెంపు వివాదం, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాలను చిరంజీవికి వివరించారు. సురేష్ బాబు, అల్లు అరవింద్, సుప్రియ, మైత్రీ రవి, దామోదర్ ప్రసాద్, సి.కల్యాణ్ చిరుని కలిసి మాట్లాడారు.
సి కళ్యాణ్ మాట్లాడుతూ 'ప్రొడ్యూసర్స్ అంతా 'చిరంజీవిని కలిశాము. సమస్యలు వివరించాము. షూటింగ్స్ ఆగడం బాధాకరమని ఆయన అన్నారు. మీ వైపు విన్నాను… ఫెడరేషన్ వాళ్ల వెర్షన్ కూడా వినాలన్నారు. రెండు మూడు రోజులు వెయిట్ చేద్దాం. . మీరు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోండి.లేకుంటే తాను జోక్యం చేసుకుంటానన్నారు' అని అన్నారు.
ALSO READ: Suriya - Agaram: 15 ఏళ్ల ప్రయాణం.. 51 మంది డాక్టర్లు.. 1800 మంది ఇంజనీర్లు..
ఈ నేపథ్యంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రస్తుత పరిస్థితిపై ఏబీన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ‘నిర్మాత లేకుంటే సినిమా లేదని, కార్మికులు లేకుండా సినిమా పూర్తికాదని ఆయన అన్నారు. ‘చిరంజీవి, పవన్ కల్యాణ్‌లకు అందరు కావాలి. చిత్ర పరిశ్రమలో వేతనాల వివాదం ఎప్పుడు ఉండేదే. ఆ హడావిడి కొద్దిరోజులే ఉంటుంది. మళ్లీ సద్దుమణుగుతుందనే విషయం అందిరికీ తెలిసిందే. చిత్ర పరిశ్రమకు స్కిల్ డెవలప్‌మెంట్ అవసరం. అది ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉంటేనే బావుంటుంది’ అని అన్నారు.
ALSO READ: Mass Jathara: ఏదేమైనా.. ధమాకాలో ఉన్నంత దమ్ము.. ఇందులో లేదురా
Hrithik Roshan: ఆ ఫలితం నాకు తెలిసింది.. మీరూ ట్రై చేయండి..
NTR Cover Page: ‘ఎస్క్వైర్ ఇండియా’ మ్యాగజైన్ కవర్‌పై ఎన్టీఆర్
Director SJ shiva: నిర్మాతల డబ్బు విరాళంగా మారుతోంది