NTR Cover Page: ‘ఎస్క్వైర్ ఇండియా’ మ్యాగజైన్ కవర్‌పై ఎన్టీఆర్
ABN , Publish Date - Aug 05 , 2025 | 03:27 PM
బాలీవుడ్‌లోకి అడుగుపెడుతూనే.. స్టార్‌డమ్‌ను డబుల్ చేసుకుంటున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. 'ఆర్ఆర్ఆర్' తో వచ్చిన క్రేజ్ ని కాపాడుకుంటూనే ముందుకు దూసుకెళ్తున్నాడు. అతి త్వరలోనే బీటౌన్‌లో ఫస్ట్ స్టెప్ వేయబోతున్న ఎన్టీఆర్ తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని పొంది హాట్ టాపిక్‌గా మారాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) స్టార్‌డమ్ రోజు రోజుకీ అంతకంతకూ పెరిగిపోతోంది. ఇటీవల వరుస హిట్లతో ఇతర హీరోలకు సాధ్యం కాని రికార్డులను తారక్ సృష్టిస్తున్నాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో అతని రేంజ్ పాన్ - ఇండియాకు పెరిగిపోయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి, విదేశీ మార్కెట్‌లోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎన్టీఆర్, ఇప్పుడు ‘వార్ 2’ (War2) తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. అయితే వార్ 2 ఎన్టీఆర్ స్టార్‌డమ్‌ను మరింత పెంచుతుండటం ఆసక్తికరంగా మారుతోంది.
ఎన్టీఆర్ క్రేజ్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఫ్యాషన్ అండ్ గ్లోబల్ బ్రాండ్‌గా మారింది. ప్రముఖ ‘ఎస్క్వైర్ ఇండియా’ (Esquire India ) మ్యాగజైన్ కవర్‌పై ఎన్టీఆర్ ఫోటోను ప్రచురించడం క్రేజీగా మారింది. దుబాయ్‌లో జరిగిన ఈ ఫోటో షూట్‌లో ఎన్టీఆర్ కుర్చీలో కూర్చుని క్లాసీ లుక్‌లో మెరిశాడు. డార్క్ మెరూన్ షేర్వానీ దుస్తుల్లో, ఆయన స్టైలిష్ ఫోజులు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ కవర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. అతని అభిమానులు సంబరపడిపోవడంతో పాటు క్రేజీ కామెంట్స్ లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్ పేజీపై దర్శనమిచ్చిన మొట్టమొదటి టాలీవుడ్ హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు ఎన్టీఆర్. అంతేకాక తారక్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫోటో షూట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే... బాలీవుడ్ లో 'వార్ 2' అడుగుపెడుతున్నాడు. ఆగస్ట్ 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇటు ప్రశాంత్ నీల్ (Prashanth Neel ) తో హై ఓల్డేజ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి 'డ్రాగన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ (Trivikram)తో సినిమా చేయనున్నాడు. ఇలా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తరుణంలో 'కాంతార 3' (Kantara 3) లో కూడా పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ను ఖుషి చేయడంతో పాటు వరుసగా ట్రెండింగ్ లో నిలుస్తున్నాడు యంగ్ టైగర్.
Read Also: Tollywood: 'మా' మద్దతు మాకే అంటున్న ఛాంబర్...
Read Also: Hansika Motwani: విడాకులు కన్ఫర్మ్.. పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన హన్సిక