Tollywood: ఈవారం తెలుగు సినిమాలు

ABN , Publish Date - Aug 28 , 2025 | 10:02 AM

ఈ వారం సినిమాల సందడి వినాయక చవితి కారణంగా బుధవారమే మొదలైపోయింది. ఆగస్ట్ 27వ తేదీనే వినాయక చవితి కానుకగా నారా రోహిత్ నటించిన 'సుందరకాండ' (Sundarakanda), శ్రీచరణ్ రాచకొండ నటించిన 'కన్యాకుమారి' (Kanya Kumari) సినిమాలు జనం ముందుకు వచ్చాయి.

This weekend movies

సహజంగా సినిమాలు శుక్రవారం విడుదల అవుతాయి. మంచి ముహూర్తం బట్టీ ఒక రోజు అటూ ఇటూ కూడా రిలీజ్ అవుతాయి. కానీ ఈ వారం సినిమాల సందడి వినాయక చవితి కారణంగా బుధవారమే మొదలైపోయింది. ఆగస్ట్ 27వ తేదీనే వినాయక చవితి కానుకగా నారా రోహిత్ నటించిన 'సుందరకాండ' (Sundarakanda), శ్రీచరణ్ రాచకొండ నటించిన 'కన్యాకుమారి' (Kanya Kumari) సినిమాలు జనం ముందుకు వచ్చాయి. చిత్రం ఏమంటే... ఈ రెండు సినిమాలు కూడా రిపీట్ టైటిల్స్ తో వచ్చినవే. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, బాపు 'సుందరకాండ' పేరుతో గతంలోనే సినిమాలు తీశారు. రాఘవేంద్రరావు తీసిన సినిమా సూపర్ హిట్ కాగా, బాపు తెరకెక్కించిన 'సుందరకాండ' పరాజయంపాలైంది. తాజాగా వచ్చిన 'సుందరకాండ'లో నారా రోహిత్ హీరోగా నటించాడు. దీనికి పాజిటివ్ టాకే వచ్చింది. దర్శకరత్న దాసరి నారాయణ రావు గతంలో 'కన్యాకుమారి' పేరుతో ఓ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారానే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకుడు అయ్యారు. ఇప్పుడు మరోసారి అదే పేరుతో సృజన్ అట్టాడ స్వీయ దర్శకత్వంలో సినిమాను నిర్మించాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. ఈ చిత్రానికి నటి మధుశాలిని సమర్పకురాలిగా వ్యవహరించింది.


ఇదిలా ఉంటే... శుక్రవారం నాడు వైవిధ్యమైన చిత్రాలు కొన్ని తెలుగువారి ముందుకు వస్తున్నాయి. అందులో ఒకటి 'త్రిబాణధారి బార్బరిక్' (Tribanadhari Barbarik). పురాణగాథను బేస్ చేసుకుని, ప్రస్తుత పరిస్థితులకు ఆ పాత్రను అన్వయిస్తూ దర్శకుడు మోహన్ శ్రీవత్స ఈ సినిమాను రూపొందించాడు. సత్యరాజ్, వశిష్ఠ, ఉదయభాను, సత్యం రాజేశ్‌ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా 'అర్జున్ చక్రవర్తి' (Arjun Chakravarthi). విజయ రామరాజు టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాను విక్రాంత్ రుద్ర తెరకెక్కించాడు. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

ac.jpg

దీనితో పాటే ఆమని, జయరామ్, కొమరం బన్నీ రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన 'బ్రహ్మాండ' (Brahmanda) సినిమా శుక్రవారం జనం ముందుకు వస్తోంది. ఒగ్గు కళాకారుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమాను రాంబాబు తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం వెలుగు చూడకముందే ఆయన కన్నుమూశారు.

WhatsApp Image 2025-02-25 at 11.40.19 AM (1).jpeg


కృష్ణ చైతన్య స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'అగ్రహారంలో అంబేద్కర్' సినిమా కూడా ఆగస్ట్ 29న విడుదల అవుతోంది. ఈ సినిమాలతో పాటు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) మలయాళంలో నిర్మించిన 'లోక' చిత్రం తెలుగులో 'కొత్త లోక' (Kotha Lokah) పేరుతో డబ్ అవుతోంది. కళ్యాణీ ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) సూపర్ ఉమెన్ గా నటిస్తున్న ఈ సినిమాలో 'ప్రేమలు' ఫేమ్ నర్లీన్ (Naslen) హీరోగా నటించాడు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేస్తున్నాడు.

kl.jpg

ఈ సినిమాలతో పాటే అక్కినేని నాగార్జున నటించిన 'రగడ' (Ragada) మూవీ ఆయన పుట్టిన రోజు సందర్భంగా 29న రీ-రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమాలలో వేటికి ఆదరణ లభిస్తుందో చూడాలి.

Also Read: Wedding Bells: ఏడు అడుగుల దిశగా నివేద పేతురాజ్

Also Read: Tollywood: సెలబ్రిటీస్ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో చూడండి

Updated Date - Aug 28 , 2025 | 10:10 AM

Kanya Kumari: కన్యాకుమారి మూవీ రివ్యూ

Sundarakanda Review: నారా రోహిత్ 'సుందరకాండ' మెప్పించిందా 

Tribanadhari Barbarik: క‌ట్ట‌ప్ప ఇర‌గ‌దీశాడుగా.. బార్బరిక్’ ట్రైల‌ర్ అదిరింది

Agraharam lo Ambetkar: అగ్రహారంలో అంబేద్కర్ టైటిల్ సాంగ్ రిలీజ్

Arjun Chakravarthy: రియ‌ల్‌ స్పోర్ట్స్ డ్రామా స్టోరి.. అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి టీజ‌ర్ అదిరింది