Tribanadhari Barbarik: క‌ట్ట‌ప్ప ఇర‌గ‌దీశాడుగా.. బార్బరిక్’ ట్రైల‌ర్ అదిరింది

ABN , Publish Date - Aug 13 , 2025 | 09:59 PM

వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్ (Satyaraj) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’

Tribanadhari Barbarik

స‌త్య‌రాజ్ (Satya Raj), వ‌శిష్ట సింహా (Vasishta N Simha), సాంచి రాయ్ (Sanchi Rai), ఉదయ భాను (Udayabhanu), సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ కీల‌క పాత్ర‌ల్లో రూపొందిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbarik). స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయపాల్ రెడ్డి ఆదిధాల నిర్మించిన‌ ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు.

అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 22న ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా ఈ చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్‌ను చూస్తుంటే ఏదో కొత్త ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ క‌థ‌తో క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు అర్ధం అవుతోంది.

Updated Date - Aug 13 , 2025 | 09:59 PM