Prabhas: 'ది రాజా సాబ్'.. మళ్ళీ వాయిదా?
ABN, Publish Date - Oct 18 , 2025 | 03:15 PM
రెబల్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలు ఉన్నాయి. అయితే ఏది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.
ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతీ (Maruthi) డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ (T.G. Vishwaprasad) నిర్మించిన 'ద రాజాసాబ్' (The Raja Saab) మూవీ పలు రిలీజ్ డేట్స్ మార్చుకుంది. ప్రస్తుతం సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన 'ద రాజాసాబ్' రానుందని వినిపిస్తోంది. అయితే ఈ డేట్ కూడా మారే అవకాశం ఉందని, ఈ సినిమా ఏకంగా సమ్మర్ కు షిఫ్ట్ అవుతోందని ఓ టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. ఎందుకంటే ఈ సినిమాతో పాటు ప్రభాస్ అంగీకరించిన చిత్రాల పరిస్థితి ఏంటనీ అభిమానులు తికమకలో ఉన్నారు. అయితే ప్రభాస్ ఓ పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారని కాబట్టి ఏ లాంటి ఆందోళన చెందవలసిన పనిలేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
'ద రాజాసాబ్' పోస్ట్ పోన్ అవుతుందన్న మాట వినిపించడానికి ఓ కారణం ఉందని కొందరు చెబుతున్నారు. ఈ చిత్ర నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ తమ నిర్మాణ సంస్థ ద్వారా టాప్ స్టార్స్ తో సినిమాలు తీసే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తో ఓ మూవీ తీస్తాననీ అన్నారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ 'ఓజీ' (OG) మూవీ రిలీజ్ అయినప్పుడు, సూపర్ హిట్ టాక్ తో సాగుతోన్న తమ 'మిరాయ్' మూవీని ఎత్తేసి మరీ 'ఓజీ' షోస్ వేయడానికి ఓకే చెప్పారు విశ్వప్రసాద్.
ఈ నేపథ్యంలోనే రాబోయే సంక్రాంతి బరిలో చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో వస్తోన్న 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Prasad Garu) కోసం తమ 'ద రాజాసాబ్'ను పోస్ట్ పోన్ చేస్తున్నారనీ వినిపిస్తోంది. అయితే ప్రభాస్ మాత్రం 'ద రాజాసాబ్'ను పూర్తి చేసిన వెంటనే హను రాఘవపూడి డైరెక్షన్ లో తాను నటిస్తున్న 'ఫౌజీ' షూటింగ్ లో పాల్గొంటారు. ఆ తరువాత నవంబర్ లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో 'స్పిరిట్' మూవీలో ప్రభాస్ నటించబోతున్నారు. ఈ రెండు సినిమాలలో ఒకటి 2026 ద్వితీయార్ధంలో, మరోటి 2027లో వస్తుందనీ అంటున్నారు.
'ఫౌజీ, స్పిరిట్' మూవీస్ తరువాత గతంలోనే తాను అంగీకరించిన 'కల్కి -2', 'సలార్-2' చిత్రాలనూ ప్రభాస్ పూర్తి చేయవలసి ఉంది. వీటిలో ఓ సీక్వెల్ ను 2026లోనే ఆరంభిస్తారట. ఆ తరువాత 2027లో మరో సీక్వెల్ కు ముహూర్తం పెడతారు. అంటే ఈ సీక్వెల్స్ లో ఒకటి 2027లో విడుదలవుతుంది, మరోటి 2028లో వస్తుందని తెలుస్తోంది. వీటితో పాటే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ప్రభాస్ ఓ మూవీ చేయనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే 'ద రాజాసాబ్' రిజల్ట్ ను బట్టి ఆ సినిమాకు కూడా సీక్వెల్ చేసే యోచన ఉందని అంటున్నారు.. ఇదే జరిగితే తెలుగునాట ప్రభాస్ 'సీక్వెల్ స్టార్'గా జేజేలు అందుకొనే పరిస్థితి నెలకొంటుంది. మరి ప్రభాస్ ప్లానింగ్ ఎలా సాగుతుందో? ఏ యే సీక్వెల్స్ తో జనాన్ని పలకరిస్తారో చూడాలి.
Also Read: Thamma: రశ్మిక మందణ్ణ 'థామా' రన్ టైమ్ ఎంతంటే...
Also Read: OG: నాలుగు వారాలకు ఓటీటీలో...