The Raja Saab: ఇది క‌దా కావాల్సింది.. ది రాజాసాబ్ ట్రైలర్ ఆప్డేట్

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:21 PM

ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ ట్రైలర్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్‌ ప్రకటించారు. దీంతో అభిమానుల్లో భారీ హైప్‌ క్రియేట్ అవుతోంది.

The Raja Saab

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా, మారుతి (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ఎంటర్‌టైనర్‌ ‘రాజాసాబ్‌’ (Raja Saab). ఈ చిత్రంపై మొదటి రోజు నుంచే ప్రేక్షకుల్లో భారీ హైప్‌ నెలకొంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, హారర్–కామెడీ జాన‌ర్‌లో ఆకాశాన్నంటే అంచ‌నాల‌తో రూపుదిద్దుకుంటుంది. ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉన్న సినిమా అనేక అవాంతారాల‌తో వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు ఓ కీల‌క ద‌శ‌కు వ‌చ్చింది.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ‘రాజాసాబ్‌’ ట్రైలర్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను ద‌స‌రా ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని సోమ‌వారం (సెప్టెంబ‌ర్ 29)న సాయంత్రం 6.30 గంట‌ల‌కు విడుదల చేయ‌నున్నట్లు చిత్ర బృందం వెల్లండించింది. దీంతో వెంట‌నే ప్ర‌భాస్ ఫ్యాన్స్ యాక్టివేట్ అయి నేష‌న‌ల్ లెవ‌ల్‌లో ట్రెండింగ్‌లోకి తీసుకు వ‌చ్చారు.

The Raja Saab

ప్రస్తుతం మూవీ షూటింగ్‌ చివరి దశలో ఉందని, ట్రైలర్‌ విడుదలతో పాటు రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ఫస్ట్‌ లుక్స్‌ మంచి రెస్పాన్స్‌ రాబట్టాయి. ఇక ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. ఇదిలాఉంటే.. రాజాసాబ్‌లో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి ఆగ‌ర్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా థమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Updated Date - Sep 28 , 2025 | 12:21 PM