The Raja Saab Trailer: వింటేజ్ ప్రభాస్ ఓకే.. కానీ, ఏదో మిస్సయ్యినట్టుందే
ABN , Publish Date - Sep 29 , 2025 | 06:54 PM
ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డ్యాన్స్ లు వేస్తున్నారు.
The Raja Saab Trailer: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డ్యాన్స్ లు వేస్తున్నారు. ఎందుకు అంటే.. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ది రాజాసాబ్(The Rajasaab) ట్రైలర్ అనుకున్న సమయానికే వచ్చేసింది కాబట్టి. ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతీ (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజాసాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మొట్ట మొదటిసారి ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్స్ రొమాన్స్ చేస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటిస్తున్నారు.
ఇప్పటికే ది రాజాసాబ్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి జనవరి 9 ని ఖాయం చేసుకుంది. ఇక దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ .. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రభాస్ సినిమా.. వింటేజ్ లుక్.. టీజర్ లో ఆ హైప్, ఆ విజువల్స్ కే పిచ్చెక్కిపోయి ఉన్నారు ఫ్యాన్స్. దీంతో ట్రైలర్ పై మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు.
ట్రైలర్ కూడా అంతా బావుంది కానీ, ఏదో మిస్ అయ్యిన ఫీలింగ్ ఉందని పలువురు పెదవి విరుస్తున్నారు. టీజర్ లో చూపించిన కథనే. ప్రభాస్ తాత సంజయ్ దత్. అతనికి ఒక మహల్ ఉంటుంది. ఆయన మరణించినా.. తన ఆస్తులు, డబ్బు ఎవరు ముట్టుకోకుండా అదే మహల్ లో ఆత్మగా తిరుగుతూ ఉంటాడు. ఆ మహల్ లో ఉన్న డబ్బు కోసం ప్రభాస్ ఫ్రెండ్స్ తో కలిసి అక్కడకు వెళ్తాడు. అక్కడ తాతతో ప్రభాస్ పోరాడి ఆ ఆస్తిని చేజిక్కించుకున్నాడా.. ? అసలు సంజయ్ దత్ దెయ్యంగా ఎందుకు ఉన్నాడు.. ? ప్రభాస్ ఆ మహల్ కి వెళ్తే వచ్చే ప్రమాదం ఏంటి.. ? చివరకు ప్రభాస్ ఆ మహల్ ను తన సొంతం చేసుకున్నాడా.. ? ఈ ప్రయాణంలో తనకు కలిసిన ముగ్గురు అమ్మాయిలు ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ట్రైలర్ చూసాకా కచ్చితంగా మారుతీని మెచ్చుకొని తీరాల్సిందే. అసలు సలార్ లో చూసిన ప్రభాస్ కి.. ఇందులో చూసిన ప్రభాస్ కి అస్సలు పోలికే లేదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. డార్లింగ్, బుజ్జిగాడు సినిమాల్లో ప్రభాస్ లుక్, ఆ కామెడీ టైమింగ్ ను ఎక్జాట్ గా దింపేశాడు. వింటేజ్ లుక్ లో డార్లింగ్ ను చూడాలి అనుకొనే ఫ్యాన్స్ కోరిక ఈ సినిమాతో కచ్చితంగా తీరుతుంది అని చెప్పొచ్చు. ఇక విజువల్స్.. ఆ క్వాలిటీ, ఫ్రేమ్స్ వేరే లెవెల్. ప్రభాస్.. మొసలి ఫైట్, ఏనుగు.. అదిరిపోయాయి.
ఇక డార్లింగ్.. ముగ్గురు హీరోయిన్లతో చేసే రొమాన్స్, డార్లింగ్ కామెడీ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. మూడు నిమిషాల 34 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ లో అన్ని ఉన్నా ఏదో చప్పగా అనిపిస్తుంది. హైప్ తీసుకొచ్చే సన్నివేశాలు, డార్లింగ్ మాస్ ఎలివేషన్ ఒక్కటి కూడా ట్రైలర్ లో లేదు. ఇంకా చెప్పాలంటే టీజర్ లో ఉన్నంత హైప్.. ట్రైలర్ లో లేదు అని అంటున్నారు. ఈ ట్రైలర్ కు థమన్ మ్యూజిక్ ఇచ్చాడు. దెయ్యం సినిమాలు అంటే మ్యూజిక్కే బలం. దెయ్యం మన కళ్ళముందుకు వచ్చినా భయపడనివారు.. వెనుక వచ్చే సౌండ్ కు గుండె చేతుల్లోకి వచ్చేలా భయపడతారు. అలాంటి సీన్స్ ట్రైలర్ లో ఉన్నా కూడా అవేమి ఇంపాక్ట్ తీసుకురాలేదు. ఇక చివరి షాట్ .. ఆ డైలాగ్ కూడా అంతగా హైప్ ఇవ్వలేకపోయింది. మొత్తానికి ట్రైలర్ బావున్నా కూడా.. సంతృప్తి లేదు అనే మాట వినిపిస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Allu Arjun: భార్య బర్త్ డే.. స్పెషల్ గా విష్ చేసిన బన్నీ
OG Collections: నాలుగు రోజులు.. ఓజీ కలెక్షన్స్ ఎంతో తెలుసా