సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Prabhas: రాజాసాబ్ వరల్డ్ లోకి మారుతీ స్వాగతం...

ABN, Publish Date - Dec 12 , 2025 | 01:06 PM

'ది రాజా సాబ్' మూవీ ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడదని మేకర్స్ ప్రతి సందర్భంలోనూ గట్టిగా చెబుతున్నారు. తాజాగా దర్శకుడు మారుతీ 'ది రాజా సాబ్' ప్రపంచంలో ప్రేక్షకులను ఆహ్వానిస్తూ... మేకింగ్ విశేషాలను ఓ సీరిస్ గా తెలియచేబోతున్నారు.

The Raja Saab Movie

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రం 'ది రాజా సాబ్' (The Raja Saab) విడుదలపై నీలినీడలు అలుముకున్న నేపథ్యంలో మేకర్స్ ఖచ్చితంగా ఈ సినిమా జనవరి 9న విడుదల అవుతుందని ఘంటాపధంగా చెబుతున్నారు. 'అఖండ 2' (Akhanda -2) సినిమా విడుదలలో జరిగిన జాప్యానికి ఆర్థిక పరమైన అంశాలే ప్రధాన కారణం. అలానే డిసెంబర్ 12న విడుదల కావాల్సిన 'వా వాతియర్' (తెలుగులో 'అన్నగారు వస్తారు), 'లాక్ డౌన్' చిత్రాలు వాయిదా పడటానికీ ఆర్థిక పరమైన విషయాలే రీజన్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్, అలానే తమిళనాట స్టూడియో గ్రీన్, లైకా సంస్థలు నిజానికి చిన్నా చితకవి కాదు. ఇప్పటికే నిర్మాణ రంగంలో ఎంతో అనుభవం సంపాదించుకున్నవి. కానీ ఈ సంస్థల చిత్రాలు అనుకున్న విధంగా రిలీజ్ కాకపోవడంతో పెద్ద నిర్మాణ సంస్థలు తెరకెక్కిస్తున్న సినిమాల విడుదల విషయంలోనూ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే... తమ సంస్థకు సంబంధించిన ఆర్థిక పరమైన లావాదేవీలు ఏవీ 'ది రాజాసాబ్' విడుదల కు ఆటంకం కలిగించేవి కాదని ఆ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) ఇటీవల ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. దానికి తోడు ఇటీవల మరో 30 రోజుల్లో జనం ముందుకు వస్తున్నట్టు ప్రత్యేకంగా ప్రకటించారు.


తాజాగా ఈ సినిమా దర్శకుడు మారుతి (Maruthi) సైతం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. శుక్రవారం రాజాసాబ్ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతూ ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. రాజాసాబ్ లో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, మేకింగ్ ఆఫ్ రాజా సాబ్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన గ్లోబల్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని వివరించబోతున్నారు. అలానే వీ.ఎఫ్.ఎక్స్.కు సంబంధించిన ఇంట్రస్టింగ్ అంశాలూ ఇందులో ఆయన తెలియచేస్తారని అనిపిస్తోంది. వరుసగా సీరిస్ గా ఈ వీడియోలను రిలీజ్ చేసి, మూవీ మీద క్యూరియాసిటీని మేకర్స్ పెంచబోతున్నారని అర్థమౌతోంది. అలానే పనిలో పనితో వీలైనంత త్వరగానే 'ది రాజాసాబ్' చిత్ర బృందంతోనూ పలు ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. సంక్రాంతి సీజన్ లో మొదట వస్తున్న సినిమా 'ది రాజా సాబ్' కావడంతో దాని విడుదల స్మూత్ గా సాగిపోతే... మిగిలిన సినిమా నిర్మాతలూ ఊపిరిపీల్చుకుంటారు. సో... దానిని దృష్టిలో ఉంచుకునే 'ది రాజా సాబ్' మేకర్స్ మూవీ పబ్లిసిటీతో పాటు రిలీజ్ సైతం సాఫీగా సాగేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Updated Date - Dec 12 , 2025 | 01:09 PM