The Raja Saab Song: రెబల్ సాబ్ వచ్చాడు.. పక్కకు తప్పుకోండమ్మా
ABN , Publish Date - Nov 23 , 2025 | 09:13 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది రాజాసాబ్(The Raja Saab).
The Raja Saab Song: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది రాజాసాబ్(The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) మాళవిక మోహనన్ (Malavika Mohanan), రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.
ఇక వచ్చే సంక్రాంతికి ది రాజా సాబ్ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఎప్పటినుంచో ప్రమోషన్స్ మొదలుపెట్టమని అభిమానులు కోరగా కోరగా ఎట్టకేలకు మేకర్స్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే రాజాసాబ్ నుంచి రెబల్ సాబ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఉదయం నుంచి ఈ సాంగ్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు. ఇక ఆ ఎదురుచూపులు వర్త్ లానే ఉంది ఈ సాంగ్.
చాలాకాలం తరువాత ప్రభాస్ ను ఈ రేంజ్ స్టైలిష్ లుక్ లో చూస్తున్నాం అన్నదానికన్నా డార్లింగ్.. స్టెప్స్ వేయడం మాత్రం అభిమానులను ఓ రేంజ్ లో సంతోషపెట్టాయి. లిరిక్స్ అన్ని ప్రభాస్.. తన కాబోయే భార్య కోసం ఎదురుచూస్తున్నట్లు రాసిన్నట్లు ఉన్నాయి. నిజం చెప్పాలంటే బయట కూడా డార్లింగ్ కు ఈ సాంగ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచిలర్ నాటో వచ్చే లైన్ అయితే నెక్స్ట్ లెవెల్.
రామజోగయ్య శాస్త్రి.. డార్లింగ్ కి తగ్గట్లు లిరిక్స్ అందించాడు. ఇక ఈ సాంగ్ ను సంచిత్ హెగ్డే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. వీడియోలో రాజా నీ స్వాగ్ సూపర్ అంటూ వచ్చే లిరిక్స్ కి ప్రభాస్ వర్షం దగ్గర నుంచి కల్కి వరకు ఉన్న లుక్స్ కటౌట్స్ చూపించి ఫ్యాన్స్ అంచనాలను ఇంకా పెంచేశారు. ఈ సాంగ్ లో ప్రభాస్ తో రిద్ది ఆడిపాడింది. ఎన్నో ఏళ్లుగా ఆకలితో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ కి మారుతీ ఫుల్ మీల్స్ ఈ సాంగ్ తో పెట్టాడు అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.