Jatadhara: సుధీర్‌బాబు జటాధర.. టీజర్ వదిలిన ప్రభాస్
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:02 PM
సుధీర్ బాబు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషిస్తున్న మైథలాజికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’.
సుధీర్ బాబు (Sudheer Babu), బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రలు పోషిస్తున్న మైథలాజికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’(Jatadhara). దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సన్నద్దమవుతోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేసి మంచి స్పందనను రాబట్టుకున్న మేకర్స్ తాజాగా శుక్రవారం ఈ మూవీ టీజర్‌ను ప్రభాస్ తన ఇన్ స్టా స్టోరీ ద్వారా రిలీజ్ చేసి సుధీర్ బాబు, సోనాక్షి, మూవీ టీకు అల్ ది బెస్ట్ చెప్పారు.
వెంకట్ కల్యాణ్ (Venkat Kalyan), అభిషేక్ జైస్వాల్ (Abhishek Jaiswal) దర్శకత్వంలో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. సంస్కృత శ్లోకం బ్యాగ్రౌండ్‌లో వినిసిస్తోండగా ఓ మారుమూల రహాస్య ప్రాంతంలో భారీ నిధి నిక్షేపాలు ఉండడం, వాటికి కాపాలా అన్నట్టు వంటి నిండా ధగధగలాడే అభరణాలతో సోనాక్షి అక్కడ కాచుకుని కూర్చుని ఉండడం, అప్పుడే సుధీర్ బాబు ఓ త్రిశూలంతో అక్కడ అడుగు పెట్టి వారిద్దరు పోరాడే దృశ్యాలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది.
ఈ టీజర్ చూసిన వారంతా సుధీర్ బాబు ఈ సారి ఏదో గట్టిగానే ఫ్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే తెలుగులోకి ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తున్న సోనాక్షి లుక్ ఫెరోసియస్‌గా చంద్రముఖి సినిమాలో జ్యోతికను తలపించేలా ఉందంటూ నెటిజన్లు పెస్టులు పెడుతున్నారు. టీజర్ బావుందని సినిమా త్వరగా చూడాలి అనేలా ఉందని, త్వరగా రిలీజ్ చేయండి అంటూ మరి కొంతమంది ట్వీట్లు పెడుతున్నారు. పైగా ప్రభాస్ స్వయంగా తన ఇన్ స్టాలో రిలీజ్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ చూస్తు టీజర్‌ను వైరల్ చేస్లున్నారు.
ఇదిలాఉంటే.. త్వరలో రిలీజ్ కానున్న ఈ ‘జటాధర’ (Jatadhara) చిత్రాన్ని ఉమేశ్‌కుమార్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ఫ్రెర్నా అరోరా, శిల్పా సింగాల్, నిఖిల్ నందా నిర్మించారు. నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్, రవి ప్రకాష్, ఇంద్ర కృష్ణ, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్షీ ఇతర పాత్రలో నటిస్తున్నారు.