Pawan Kalyan: 'ఓజీ' థియేటర్లు దద్దరిల్లబోతున్నాయ్

ABN , Publish Date - Sep 07 , 2025 | 03:01 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'ఓజీ' ఈ నెల 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా పబ్లిసిటీలో భాగంగా స్టైలిష్ స్టాండీని రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లకు నిర్మాత డీవీవీ దానయ్య పంపబోతున్నారు.

OG Movie

సినిమాల పబ్లిసిటీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. వినైల్ పోస్టర్స్ స్థానంలో ట్రెండీగా థియేటర్లలో స్టాండీలు పెడుతున్నారు. గతంలో త్వరలో విడుదల కాబోతున్న సినిమాలకు సంబంధించిన నిలువెత్తు స్టాండీలను పెట్టేవారు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న 'ఓజీ' సినిమాకు అడ్డంగా ఉండే స్టాండీని మేకర్స్ ప్రత్యేకంగా తయారు చేయించారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లకు వీటిని పంపే పనిలో ఉన్నారు. విదేశీ కారు ముందు ఓజెస్ గంభీర స్టయిల్ గా నిలబడిన ఈ స్టాండీ చూడటానికి భలే ఉంది. రేపు థియేటర్లలో దీన్ని పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్‌ అభిమానులంతా ఈ స్టాండీ ముందు ఫోటోలు దిగడానికి క్యూ కట్టడం ఖాయం.


ఇప్పటికే థియేటర్లలో 'ఓజీ' (OG) టైటిల్ సాంగ్ ను ప్రదర్శిస్తున్నారు. దానికి పవర్ స్టార్ అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆ పాటలో పవన్ కళ్యాణ్‌ కనిపించేంది చివరితో రెండు మూడు షాట్స్ లోనే అయినా... వి.ఎఫ్.ఎక్స్, గ్రాఫిక్స్, ఆర్.ఆర్. ఈ పాటను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. పైగా తమన్ (Thaman) తో పాటు సింగర్ రాజకుమారి (Rajakumari) సైతం తనదైన స్టైల్ లో ఇచ్చిన బాడీ మూమెంట్స్ ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తున్నాయి. ఈ నెల 25న 'ఓజీ' మూవీ వరల్డ్ వైల్డ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సంక్రాంతి విడుదలైన వెంకటేశ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత తెలుగులో రూ. 300 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన సినిమా మరేదీ లేకపోయింది. ఆ లోటును 'ఓజీ' తీర్చుతుందని, దానికన్నా మెరుగైనా కలెక్షన్స్ ఇది రాబడుతుందని, మెగాభిమానులంతా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ వీరాభిమాని అయిన సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య గ్రాండ్ గా 'ఓజీ' మూవీని నిర్మిస్తున్నారు.

Also Read: SIIMA -2025: ఉత్తమ చిత్రం ‘అమరన్‌’.. ఉత్తమ నటి సాయిపల్లవి

Also Read: Bhumi Pednekkar: యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌ సమ్మిట్‌లో...

Updated Date - Sep 07 , 2025 | 03:09 PM

OG - Pawan kalyan : పవన్‌ కనిపించేది ఎంత సేపంటే...

OG Craze Peaks: 'ఓజీ' ఒక్క టిక్కెట్‌ రూ.5 లక్షలు..

OG DOP: డీఓపీ మారినా...

OG Firestorm: ఓజీ ఫైర్‌ స్ట్రామ్‌ గంభీర.. లిరికల్‌ వీడియో వచ్చేసింది

OG Glimpse: పవన్ కళ్యాణ్ ‘OG’ గ్లింప్స్