Bhumi Pednekkar: యంగ్ గ్లోబల్ లీడర్స్ సమ్మిట్‌లో...
ABN , Publish Date - Sep 07 , 2025 | 01:42 PM
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్(Bhumi Pednekar) అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్(Bhumi Pednekar) అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. జెనీవాలో జరిగిన ప్రతిష్ఠాత్మక యంగ్ గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ 2025లో (Young Global Leaders Summit 2025) ఆమె పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌తో పాల్గొన్న తొలి భారతీయ నటిగా భూమి నిలిచారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రపంచవ్యాప్త సవాళ్లను చర్చించి అర్థవంతమైన మార్పును తీసుకురావడానికి పలు రంగాలలో గుర్తింపు తెచ్చుకున్న యువతరం వ్యక్తులు సమావేశం అయ్యారు. భూమి పెడ్నేకర్ సోషల్ మీడియా వేదికగా ఈ సదస్సుకు సంబంధించిన ఆనందకరమైన క్షణాలను, అభిప్రాయాలను షేర్ చేశారు. నటిగా సినిమాల్లో బలమైన పాత్రలు పోషిస్తుంటారు. పర్యావరణ పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నారు. సొసైటీలో ఉన్న సమస్యలపై గొంతెత్తి మాట్లాడతారు.
ఆమె మాట్లాడుతూ ‘ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించే వేదికలో నేనూ భాగం కావడం గర్వంగా ఉంది. ఇది నాకు కొత్త ప్రేరణను ఇచ్చింది’ అని అన్నారు. ప్రస్తుతం ఆమె ‘దల్దాల్’ వెబ్ సిరీస్‌లో పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.