సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Aadi Saikumar: నాట్స్ లో 'శంబాల' టీజర్ ప్రదర్శన

ABN, Publish Date - Jul 17 , 2025 | 03:32 PM

'కల్కి 2898 ఎ.డి.' సినిమా విడుదలైన తర్వాత శంబాల పేరు బాగా పాపులర్ అయ్యింది. దాంతో ఆది సాయికుమార్ తో తీస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ కు అదే పేరు పెట్టేశారు.

Aadi Saikumar

ప్రముఖ నటుడు ఆది సాయికుమార్ (Aadi Saikumar) తాజా చిత్రం 'శంబాల' (Shambala). ఎ మిస్టికల్ వరల్డ్ అనేది దీని ట్యాగ్ లైన్. ఈ సూపర్ నేచురల్ థిల్లర్ మూవీని యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తిక్ ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala) సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై మూవీ మీద అంచనాలను భారీగా పెంచేసింది.


విదేశాలలో తెలుగు, సంస్కృతిని కాపాడుతూ, సినిమా సెలెబ్రెటీస్ తో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేసే సంస్థగా 'నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) కు చక్కని పేరుంది. ఈసారి వారు నిర్వహించిన కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్, సమంత, శ్రీలీల వంటి వారు దీనిలో పాల్గొన్నారు. ఇక్కడ ఆది సాయికుమార్ నటించిన 'శంబాల' టీజర్ ను ప్రదర్శించారు. దాంతో ఈ టీజర్ గురించి, ఈ సినిమా నేపథ్యం గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు. అక్కడ 'శంబాల' మూవీ ఓ హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ లైవ్ మ్యూజిక్ కన్సర్న్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందులో పాల్గొన్న అతిథులంతా టీజర్ చాలా బాగుందని ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, విజువల్ వండర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే జనం ముందుకు తీసుకొస్తామని మేకర్స్ తెలిపారు.

Also Read: Sobhanbabu: 50 ఏళ్ళ 'బలిపీఠం'

Also Read: Bakasura Restaurant: వడ్డించడమే తరువాయి...

Also Read: Genelia horror comedy: హారర్ కామెడీ మూవీలో హాసిని...

Updated Date - Jul 17 , 2025 | 03:34 PM