Kantara Chapter1: కాంతార.. కనకవతి వచ్చేసింది! రుక్మిణి లుక్ అదిరింది
ABN , Publish Date - Aug 08 , 2025 | 09:33 AM
కాంతార వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'కాంతార ఛాప్టర్-1’
కాంతార వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'కాంతార ఛాప్టర్-1’ (Kantara chapter-1). ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ క్రమంగా ప్రచార కార్యక్రమాలకు నడుం బిగించారు.
అయితే ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్, నటుల వివరాలు వెళ్లండించని మేకర్స్ తాజాగా శుక్రవారం ఈ చిత్రంలో కథానాయికగా చేస్తోన్న రుక్మిణీ వసంత్ (Rukmini) లుక్ రివీల్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. కనకవతి పాత్రను పరిచయం చేస్తున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు. రాజసం ఉట్టి పడేలా రుక్మిణీ లుక్ అదిరిపోయింది.