Ram Pothineni: 'ఆంధ్రకింగ్ తాలూకా' వచ్చేది ఎప్పుడంటే...
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:46 PM
రామ్ పోతినేని తాజా చిత్రం 'ఆంధ్రకింగ్ తాలూకా' విడుదల తేదీ ఖరారైంది. ఈ యేడాది నవంబర్ 28న దీనిని వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.
రామ్ పోతినేని (Ram Pothineni), భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) జంటగా తెరకెక్కుతున్న సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా' (Andhra King Taluka). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పి. మహేశ్ బాబు (P. Mahesh babu) దర్శకుడు. ఈ ఇందులో సూపర్ స్టార్ ఉపేంద్ర (Upendra) వీరాభిమానిగా రామ్ పోతినేని నటిస్తున్నాడు. గురువారం ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నవంబర్ 28న ఈ సినిమా జనం ముందుకు రాబోతోందని తెలిపారు. అభిమానులు తమని తాము సిల్వర్ స్క్రీన్ మీద మొదటిసారి చూసుకునే అవకాశం తామిస్తున్నట్టుగా మైత్రీ మూవీ మేకర్స్ తెలిపారు.
ఇదే సమయంలో రామ్ పోతినేని సోషల్ మీడియాలో 'ప్రియమైన మెగా, లయన్, కింగ్, విక్టరీ, పవర్, సూపర్, రెబల్, టైగర్, మెగాపవర్, స్టైలిష్, రియల్, రజని, ఖా... ఫాన్స్ తో పాటు ఇతర స్టార్స్ ఫాన్స్ అందరికీ మిమ్మల్ని మీరు తెర మీద చూసుకునే సినిమా ఇది అని పేర్కొన్నాడు. మీ జీవితాలను బిగ్ స్క్రీన్ మీద చూసుకోండి అని తెలిపాడు. ఈ మధ్య కాలంలో ఓ అభిమాని కథ ఇలా తెలుగులో రావడం ఇదే. వివేక్ - మెర్విన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ట్యాలెంటెడ్ స్టార్ కాస్ట్, అద్భుతమైన కథాంశం, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోందని నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి తెలిపారు.
Also Read: Gemini Suresh: 18 ఏళ్ళ కల.. హీరోగా జెమిని సురేష్
Also Read: Neha Sharma: నేహాశర్మ.. కొత్త అవతారం! ఏకంగా ఆ హీరోతో