Andhra King Taluka Movie: నువ్వుంటే చాలే... అంటున్న రామ్‌

ABN , Publish Date - Jul 19 , 2025 | 05:37 AM

రామ్‌ పోతినేని కథానాయకుడిగా మహేశ్‌ బాబు.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం

రామ్‌ పోతినేని కథానాయకుడిగా మహేశ్‌ బాబు.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’. మైత్రీ మూవీ మేకర్స్‌ బేనర్‌పై నవీన్‌ యర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం రామ్‌ రాసిన పాటను చిత్రబృందం శుక్రవారం ఆవిష్కరించింది. ‘నువ్వుంటే చాలే..’ అంటూ సాగే ఈ గీతానికి సంగీత ద్వయం వివేక్‌- మెర్విన్‌ స్వరాలు సమకూర్చగా అనిరుధ్‌ రవిచందర్‌ ఆలపించారు. ఈ పాటలోని ప్రతి లైన్‌ మనసుని తాకుతుంది. ప్రేమకు నిజమైన నిర్వచనాన్ని కనుగొనడానికి హీరో చేసే ప్రయత్నంలా అనిపిస్తుంది. ‘ప్రేమని నిర్వచించలేం, కేవలం అనుభవించగలం. ఈ పాట ఒక చిన్న కథలా అనిపిస్తుంది. భావోద్వేగాలతో ప్రయాణించే అనుభూతిని కలిగిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా, ఈ సినిమాలో రామ్‌ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. ఉపేంద్ర, రావు రమేశ్‌, మురళీ శర్మ, సత్య, రాహుల్‌ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 05:37 AM